చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారు.. చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారని మంత్రి సీతక్క అన్నారు. భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ ను ఆదరించాలని సూచించారు. పెండింగ్ పనులను అన్నీ పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్దిలో అగ్రబాగంలో ఉంచుతామన్నారు. దేహాలు ముక్కలు అయినా పర్వాలేదు అని దేశం కోసం పని చేసింది ఇందిరా గాంధీ కుటుంబం అని తెలిపారు. బీజేపి మతాల గురించి తప్ప పనుల గురించి చెప్పరని అన్నారు. మోడీ వచ్చి ఆదిలాబాద్…
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. 25 శాతం మాత్రమే కేంద్రం కొంటుందని మిగతా 75 శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద విడుదల చేయడం సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్ఎస్ను ఓడించిన ఉత్సాహంతోనే బీజేపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.
మరో కొత్త తరహా ప్రయోగానికి ఇస్రో సిద్ధం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈ రోజు ఉదయం 6 గంటలకు తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ ద్వారా ప్రైవేట్ రాకెట్ ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలోనే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన అగ్ని బాన్ రాకెట్ ప్రయోగించనున్నారు. ప్రయోగంలో సెమీ క్రయోజెనిక్ ఆధారిత ఇంజిన్…
Kishan Reddy: ఈ సీఎం కు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది తప్ప ఇచ్చిన గ్యారంటీ ల అమలు మీద లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉమా సత్య సాయి గద్దె అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో యునైటెడ్ స్టేట్స్లో భారత సంతతికి చెందిన వారు మృతిచెందడం ఇది 10వ ఘటన. అగ్ర రాజ్యంలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తోంది. ఉమా సత్య సాయి మరణాన్ని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. అయితే ఆ విద్యార్థి ఎలా చనిపోయాడు. మృతికి గల కారణాలు..…
క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తారు.. సినీ స్టార్స్ ఎక్కువగా స్టేడియంలలో సందడి చేస్తారు.. కానీ ఒక సీఎం స్టేడియంకు వెళ్లి క్రికెట్ ను వీక్షించడం అంటే మామూలు విషయం కాదు.. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 17వ మ్యాచ్ నిన్న జరిగింది.. ఈ మ్యాచ్ ను చూడటానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. హాజరుకానున్న ఖర్గే, రాహుల్గాంధీ, రేవంత్, నేతలు. జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్ గాంధీ. 10 లక్షల మంది జన సమీకరణకు కాంగ్రెస్ ప్రణాళిక. నేడు పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు. క్రోసూరు, సత్తేనపల్లి బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
నేడు సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జన జాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు.