K. Keshava Rao: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే. కేశవరావు..
- కె.కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి..
- కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Keshava Rao: ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా వ్యవహారాల సలహాదారుగా కేశవరావు కొనసాగుతారు. కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేకే గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకడ్‌తో కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేకే పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉంది. దీంతో పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు, ఎంపీ ఎన్నికల్లో టిక్కెట్ రాని సీనియర్ నేతలు ఆ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. అయినా వారి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది, ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీకి సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Read also: BRS MLA Into Congress: కాంగ్రెస్ లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. రేపు మరో నలుగురు..!
Also Read
గతేడాది (2023) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవడంతో పరిణామాలన్నీ మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీ కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన పార్టీ.. ఘర్ వాపసు అంటోంది. అంతేకాదు ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను పార్టీలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పెద్దలు కేకేతో చర్చలు జరిపారు. గతంలో హైదరాబాద్ మేయర్‌గా ఉన్న ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి పార్టీలో చేరారు. ఈ సమయంలో కేకే కూడా పార్టీలో చేరతారని అందరూ భావించారు. అయితే కెకె అధికారికంగా కాంగ్రెస్‌లో చేరలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు పెద్దపీట వేసింది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు చేతులు కలిపారు. మరికొందరు చేరే అవకాశం ఉంది.
Balkampet Yellamma: బల్కంపేట రోడ్డు మూసివేత.. మళ్లింపు ఇలా..
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!