నేడు ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం. ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం. కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్, ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు. విశాఖ: ఏపీ లిక్కర్ కేసులో సుదీర్ఘంగా కొనసాగిన సిట్ తనిఖీలు.. నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ముగిసిన సోదాలు. నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగిన సిట్ విచారణ.. హార్బర్ పార్క్ ఏరియాలోని వెర్టిలైన్, గ్రీన్ ఫ్యూయల్ సంస్థల కార్యాలయాల నుంచి హార్డ్…
“ది లక్” – సామాన్యుల కోసం తొలి రియాలిటీ గేమ్ షో! దేశంలో రియాలిటీ షోల పట్ల ప్రజల్లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన షోలు ఎక్కువగా సెలబ్రిటీలు, సినీ తారలు లేదా ప్రముఖులను ఆధారంగా చేసుకుని సాగాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో ఒక వినూత్నమైన రియాలిటీ గేమ్ షో రాబోతుంది. అదే “ది లక్”. ఇది సామాన్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి అతిపెద్ద రియాలిటీ షో. ఈ…
చేసే పని ఏదైనా సరే... చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవసరం. ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా అలాంటి ఈక్వేషన్స్ ఉండాల్సిందే. ఉంటాయి కూడా. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఈ లెక్కల గురించిన చర్చే మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళకు దగ్గర పడుతున్న క్రమంలో.... సర్కార్ పెద్దలు కూడికలు...తీసివేతల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
ఆపిల్ iPhone 17 సిరీస్ లాంచ్.. ఏ ఫోన్ ఎంతకు లభిస్తుందంటే? ఆపిల్ (Apple) సంస్థ ప్రకటించిన iPhone 17 సిరీస్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ వివిధ శ్రేణిలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. మరి ఈ మొబైల్స్ మోడల్ ధరలు, స్టోరేజ్ ఆప్షన్స్, రంగులు, ప్రీ-ఆర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి. iPhone 17…
కేటీఆర్‌ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్.. వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానన్న ఆయన.. కేటీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడగాలా?.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.
మిరాయ్ లో ‘రాముడు’గా టాలీవుడ్ స్టార్ హీరో హనుమాన్తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా.. నెక్ట్స్ మిరాయ్తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పై నిర్మించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం…
తెలంగాణలో పార్టీ మారి... మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేల్లో చాలామంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ మాట్లాడుతున్నారు. పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో... చర్చ సీరియస్‌గానే నడుస్తోంది. స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో... ఇక నాన్చకుండా... ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
నల్గొండ ప్రజల కోసమే మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని.. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య మాత్రమే కాకుండా.. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందన్నారు. సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు కానీ.. మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? అని సీఎం ప్రశ్నించారు. మూసీ…
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఏడాదే గోదావరి ఫేజ్ 2, 3 పనులు ప్రారంభిద్దాం అనుకున్నా కొందరు అడ్డుకున్నారని.. గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకువస్తాం అని చెప్పారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు. ప్రాణహిత…