Mega158: బర్త్‌డే స్పెషల్‌గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega158: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మెగా158’. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి దర్శకుడు బాబీ కొల్లి, చిరంజీవి కలయికలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కూడా. ఈ రోజు దర్శకుడు బాబీ కొల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇప్పుడు అభిమానులను ఆకర్షిస్తోంది. సెట్స్‌లో దర్శకుడి పనితీరు ఎలా ఉంటుంది? అనే ఆసక్తికి ఈ వీడియో ఒక చిన్న సమాధానంగా నిలిచింది. చిత్రబృందం విడుదల చేసిన బీహైండ్ ది సీన్స్ వీడియోలో బాబీ కొల్లి పూర్తి కాన్ఫిడెన్స్ తో షూటింగ్ చేస్తున్నట్లు కనిపించింది. ఒకవైపు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూనే, మరోవైపు ప్రతి ఫ్రేమ్‌ను శ్రద్ధగా పరిశీలిస్తూ, యూనిట్ సభ్యులతో చిరునవ్వుతో మెలుగుతున్న ఆయన స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయిందని సమాచారం. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో చిరంజీవిపై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ శరవేగంగా జరిగింది. ఈ ఎపిసోడ్ అనంతరం చిరంజీవి నటనకు, బాబీ కొల్లి రూపొందించిన విజన్‌కు మొత్తం చిత్రబృందం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఆ ఒక్క ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ బ్లాక్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తుందని యూనిట్ అంతా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా, నివేదా పేతురాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. కథలో ఈ పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
‘Mega158’ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ప్రకటించనప్పటికీ, సినీ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా జనవరి 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్కు ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్‌ను కూడా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక చిరంజీవి అభిమానులు కూడా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, భారీ యాక్షన్ సీక్వెన్స్, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, దర్శకుడి స్టైలిష్ మేకింగ్ కలిసి ‘మెగా158’ను మరో భారీ విజయంగా నిలబెడతాయా అన్న ఆసక్తి అయితే ఇప్పుడు అభిమానుల్లో కనపడుతోంది.
To the man gearing up to set THE BLOODY BENCHMARK with his vision…💥🪓
Team #Mega158 wishes their blockbuster director @dirbobby a very Happy Birthday❤️🔥
Can’t wait for the world to witness what you’re creating with #ChiruBobby2 🔥
Megastar @Kchirutweets@TheKVNofficial… pic.twitter.com/Y9h4lDXVlu
— KVN Productions (@KvnProductions) August 1, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు