Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఇండో – కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ తన స్పీచ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మంచి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. సినిమా ప్రయాణం ఎంతో అందమైన అనుభూతిని ఇచ్చిందని, ఆ జ్ఞాపకాలన్నింటినీ తెరపై చూపించే ప్రయత్నం చేశామని చెప్పారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కొరియన్ భాషపై కూడా ఆసక్తికరంగా స్పందించారు. సినిమాలోని డైలాగుల కోసం కొరియన్ పదాలు నేర్చుకున్నానని, కానీ ఇప్పుడు పూర్తిగా గుర్తు లేవని సరదాగా వ్యాఖ్యానించారు. తాను నేర్చుకున్న కొన్ని పదాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేశారు. కొరియన్ పదానికి అర్థం చెప్పే క్రమంలో అభిమానులతో సరదాగా ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో అభిమానులు “జై జై బాబు.. కళ్యాణ్ బాబు” అంటూ నినాదాలు చేయడంతో వరుణ్ తేజ్ ఎమోషనల్‌గా స్పందించారు. ఆ పేరు తన గుండెల్లో ఎప్పుడూ ఉంటుందని భావోద్వేగంగా తెలిపారు. అలాగే ఈ సినిమా ట్రైలర్‌ను డిజిటల్‌గా విడుదల చేస్తున్న తన సోదరుడు రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. రామ్ చరణ్ రావాల్సి ఉన్నప్పటికీ సర్జరీ కారణంగా హాజరు కాలేకపోయారని, ఫోన్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారని వరుణ్ తేజ్ వెల్లడించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, టీ-సిరీస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హారర్, కామెడీ అంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?