సచివాలయంలో ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై చర్చించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. అలాగే.. అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ అంగన్ వాడీలలో…
తెలంగాణ ప్రభుత్వం హైడ్రా విధివిధానాలు విడుదల చేసింది. హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా మున్సిపల్ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి ఉండనున్నారు. అంతేకాకుండా.. హైదరాబాద్, రంగారెడ్డి ఇంఛార్జ్ మంత్రులు, జీహెచ్ఎంసి మేయర్, సీఎస్, డీజీపీ, ఎంఎయుడి ప్రిన్సిపల్ సెక్రటరీలు హైడ్రాలో సభ్యులుగా ఉంటారు.
కాంగ్రెస్ ప్రాక్టికల్ పార్టీ.. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రుణమాఫీ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహూల్ బటన్ నొక్కితే సీఎం రేవంత్ రుణమాఫీ చేశారన్నారు. సినిమాల్లో రైతుల గురించి చూపించి డబ్బులు సంపాదించిన చిరంజీవి.. నల్ల చట్టాల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నల్ల చట్టాలు తెచ్చిన మోడీకి మద్దతు ఇచ్చి.. రైతులకు అండగా ఉన్న రాహుల్ గాంధీకి మద్దతు ఎందుకు ఇవ్వలేదని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైరయ్యారు. రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు పారిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు.
సైబర్ నేరగాళ్లు రైతులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగోతో ఏపీకే ఫైల్స్ (APK files) పంపుతున్నారు.
డీఎస్సీ హాల్టికెట్లో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. అప్లై ఎలా చేశారో..! తెలంగాణలో డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. డీఎస్సీ హాల్ టికెట్లను https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బాగానే వున్నా…
ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని ఆయన వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని,…