తెలంగాణ సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమీషన్లకు ఆశపడి ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వకుండా కెసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. “ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..? తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు…
టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పదేపదే తన పేరు ప్రస్తావించడంపై తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు.. పదేపదే ఈటల నా పేరు ప్రస్తావించడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనమన్న హరీస్.. ఈటల వ్యాఖ్యలను ఖండించారు.. ఈటల టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవ కంటే.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువని వ్యాఖ్యానించిన ఆయన.. రాజేందర్.. పార్టీని వీడినా టీఆర్ఎస్‌కు వచ్చిన నష్టం ఏమీలేదన్నారు.. నా కంఠంలో ఊపిరి ఉన్నంత…
తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ కామెంట్ చేశారు బీజేపీ నేత ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.. టీఆర్ఎస్ నుంచి వలసలపై స్పందించిన ఆయన.. ఆలే నరేంద్రను వెళ్లకొట్టారు, విజయ శాంతి, స్వామి గౌడ్ వంటి ఎంతో మందిని బయటకు పంపించారు.. ఇప్పుడు ఈటల వంతు వచ్చిందన్నారు.. మధుసూదనాచారిని కేసీఆరే ఓడగొట్టారంటూ విమర్శించిన ఆయన.. ఇక, మిగిలింది హరీష్ రావే!.. హరిష్ రావుకు కూడా అనేక అవమానాలు జరిగాయని చెప్పుకొచ్చారు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ నెల 10వ తేదీన కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, పోలీస్ కార్యాలను ప్రారంభించనున్నారు.. ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని భవనాలను సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.. కామారెడ్డి పట్టణ శివారులోని నూతన కలెక్టరేట్, పోలీసు భవనాల నిర్మాణ పనులను 2017లో అప్పటి రెవెన్యూశాఖ మంత్రి మహ్మద్‌అలీ ప్రారంభించగా.. సుమారు 30 ఎకరాలలో రూ.66 కోట్ల నిధులతో…
వ్యాక్సినేషన్ విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉందన్న ఆయన.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని.. మరోవైపు…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ధరణి పోర్టల్ పై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ధరణి పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ప్రతిరోజూ పెండెన్సీ స్థితిని పర్యవేక్షించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వాట్సాప్, ఈమెయిల్ లతో పాటు అందిన అన్ని ఫిర్యాదులపై స్పందించి,ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదనే విషయం ప్రస్థుతం కరోనా సమయంలో మరోసారి రుజువయ్యిందన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్థున్న దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలం అని సిఎం అన్నారు. ఆరోగ్య సంపదను మించిన సంపద లేదనే ఎరుకతోనే తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి కార్యాచరణ…
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తు, గులాబీ జెండా గుర్తుతో గెలిచిన విషయాన్ని మంత్రి ఈటెల రాజేందర్ గుర్తుంచుకోవాలని… తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పని చేశారని… వారంత కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించారని పేర్కొన్నారు. అందులో ఈటెల ఒక్క కార్యకర్త మాత్రమే…టీఆర్ఎస్ పెట్టిన తర్వాత 2003 లో ఈటెల జాయిన్ అయ్యారని చురకలు అంటించారు. కేసీఆర్ తమ నాయకుడు అని.. ఆయన నాయకత్వంలో పని చేసేందుకు నియోజక వర్గ ప్రజాప్రతినిధులు,…
ఈటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది టీఆర్ఎస్. ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు ఈటల. అయితే ఈటల వ్యాఖ్యలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల ప్రయత్నాలు ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందిని కెసిఆర్ నాయకులుగా తయారు చేశారని.. అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై సిఎం కెసిఆర్ స్పందించారంటే అది నియంతృత్వం…
తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్… చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పదవులు ఖాళీ కావడంతో ప్రొటెం చైర్మన్‌ను గవర్నర్ నియమించారు. మండలికి చైర్మన్‌ను ఎన్నుకునే వరకు భూపాల్ రెడ్డి ఆ పదవిలో కొనసాగనున్నారు. కొత్తగా ఎన్నికయ్యే మండలి సభ్యుల చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించడం, కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవటం, ఇతర మండలి వ్యవహారాలు చూసుకొంటారు. సాధారణ…