ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇంటర్ పరీక్షలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. టేబుల్ ఐటమ్ గా ఇంటర్ ఎగ్జామ్స్ ఇష్యూ ఉంది. కొద్దిసేపటి క్రితమే అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం ముందు ఉన్న ఆప్షన్స్… పరీక్షలు రద్దు చేసి ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఆధారంగా రిజల్ట్స్ ప్రకటించడం లేదా పరీక్ష సమయం తగ్గించి సగం ప్రశ్నలకే జులై…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ.. నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్.. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామన్నారు.. దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార…
టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని.. ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. టీఆరెస్ పార్టీ ఒక గడిలా పార్టీ అని.. నిజాంను మైమరిపించే విధంగా ఒక రాక్షస నిరంకుశ పాలన కోనసాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈటెలకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా జరిగిందంటే మిగతా వాళ్లు కూడా ఆలోచించు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.…
కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఠాగూర్ తన పైన చిన్న చూపు చూస్తున్నారని.. తెలంగాణలో బలమైన నాయకుడిగా ఠాగూర్ నన్ను గుర్తించకపోవడం నా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పీసీసీ అడుగుతున్నా.. ఢిల్లీ చర్చలో తన పేరు లేకపోవడం దురదృష్టమన్నారు. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే బాంబే హైవే మీద కేసీఆర్ ను అడ్డగించిన చరిత్ర తనది అని.. ఇది ఠాగూర్ కు తెలువక…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేకనే ఈ పరిస్థితులు వచ్చాయి అని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ పరిస్థితి కారణం ప్రధాని మోడీ ,సీఎం కేసీఆరే అని తెలిపారు. గతేడాది అసెంబ్లీలో భట్టి విక్రమార్క అడిగితే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని అడిగితే ఒప్పుకున్నాడు. 9నెలలు అవుతున్న ఇప్పటికి అమలు లేదు. ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడం పైనే కేసీఆర్ దృష్టి ఉంది. ఎంతోమంది చనిపోతున్న కేసీఆర్ కు పట్టింపులేదు. ధనిక రాష్ట్రం…
పీఆర్సీ అమలు కోసం గత కొన్ని నెలలుగా ఎరుదుచూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించడంతో.. ఇక త్వరలోనే అమలు అవుతాయని.. జీతాలు పెరుగుతాయని అంతా ఎదురుచూస్తూ వచ్చారు.. అయితే, ఉప ఎన్నికలు, మరికొన్ని కారణాలతో పీఆర్సీ అమలు వాయిదా పడుతూవచ్చింది. కానీ, రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో దానికి మోక్షం లభించే అవకాశం ఉంది.. రేపటి కేబిట్ సమావేశంలో పీఆర్సీపై చర్చించనున్నారు.. ఉద్యోగుల వేతన సవరణ పూర్తి నివేదికను…
రాష్ట్రంలో భయంకర పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇండియా నుండి వచ్చే వారిని రానివ్వటం లేదు అని భట్టి విక్రమార్క సీఎల్పీ నేత అన్నారు. గతేడాది దీపాలు పెట్టండి చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని చెప్తారు. ఇంట్లో దీపం ఆర్పేసి భయట దీపాలు పెట్టండి అంటారు. వ్యాక్సిన్ కూడా లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి తీరు కూడా అలాగే ఉంది అని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని మరణాలకు కారణం సీఎం కేసీఆరే కారణం. కరోనా దెబ్బ తిన్న కుటుంబాలకు…
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను రెండో సీఎంగా, సొంత తమ్ముడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకున్నారన్నారని..బీజేపీ మత తత్వ, రెచ్చగొట్టే, విభజించి పాలించే పార్టీ అని అన్నారు. హుజురాబాద్ లో TRS పార్టీ కార్యాలయంలో రజక కుల సంఘం నాయకులతో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితేల సతీశ్ కుమార్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. కష్టపడి గెలిపించిన టీఆర్ఎస్ నాయకులను…
డయాగ్నస్టిక్ సెంటర్ల ఓపెనింగ్ పై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి (7న) ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని వొకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సిఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సిఎం…
రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. రైతుబంధు నిధుల విషయంలో…