కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తి స్తుందని.. ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుందని… మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిందని.. 425 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ లు టిఆర్ఎస్ కు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని స్పష్పం చేశారు. మార్చి నెల వరకు తెలంగాణలోని అన్ని నియోజక వర్గాల వారికి దళిత బంధు అందిస్తామని ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిన తర్వాత దళిత బంధును ఆపారని… నవంబర్ 4 తర్వాత దళిత బంధును ఇచ్చి తీరుతామన్నారు. దళిత బంధును ఎవరూ ఆపలేరన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన ఉద్వేగ భరిత వాతావరణం.. ఆవేశాన్ని.. పరిస్థితులను… సామాజిక అభివృద్ధి వైపు మార్చగలిగామని చెప్పారు. తెలంగాణ వస్తే కారు చీకట్లు వస్తాయని… అభివృద్ధి జరగదని… పరిపాలన సాధ్యం కాదని అన్నారని గుర్తు చేశారు. కానీ… కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారమే… తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి వ్యవసాయ ఉత్పత్తులు సాధించామని… విద్యుత్ ఉత్పత్తి లో నెంబర్ లో వన్ గా నిలిచామని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతాలు సాధిస్తుందన్నారు. తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నారని చెప్పారు సీఎం కేసీఆర్.