తెలంగాణ కు అన్యాయం చేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో రైతు బాయిల్డ్ రైస్ పండిస్తారా… ఆ రైస్ ను రైస్ మిల్లర్లు కొని రా రైస్, బాయిల్డ్ రైస్ చేస్తారు. గత మూడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వాలతోబాయిల్డ్ రైస్ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ధాన్యం కొనుగోలు కోసం నిధులు రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్రం ఇస్తుంది… 8.5 శాతం వడ్డీ కూడా ఇస్తుంది. ఈ ఏడాది 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకుంటామని ఒప్పందం జరిగింది. 90 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని సీఎం సెప్టెంబర్ 17 న కేంద్రానికి లేఖ రాశారు. ఆ తరవాత తెలంగాణ లో 108 లక్షల మెట్రిక్ టన్నుల తీసుకోవాలని లేఖ రాసింది. తెలంగాణలో కేంద్రం 2014లో రైతుల ధాన్యం పై 3 వేల 404 కోట్లు ఉంటే 26 వేల 641 కోట్లు ఖర్చు పెడుతుంది.
హుజూరాబాద్ ప్రజల మీద ధర్నా చేస్తున్నారా.. ఎవరి మీద ఆబండాలు వేస్తున్నారు. మా కుటుంబానికి మాత్రమే పడికట్టే పదాలతో విమర్శించే శక్తి ఉందని అనుకోకండి. అబద్ధాల మీద, విష ప్రచారాల మీద పాలన చేయకండి. అప్పులు చేసి కమిషన్ లు తీసుకోలేదు. సీఎం ప్రగతి భవన్ లో కూర్చొని చైనా అధ్యక్షుడు తో సహా 19 దేశాల అధినేతలతో మాట్లాడి రామప్ప దేవాలయం కి యునెస్కో గుర్తింపు తెచ్చారు… కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఏమి లేదు… వారికి ధన్యవాదాలు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేస్ కోసం సీఎంకి మూడు లేఖలు రాశాను అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.