దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా లేకపోలేదు.. దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసింది.. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సినిమాపై మండిపడ్డారు.. ఇవాళ తెలంగాణ భవన్‌లో…
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్‌రావు.. బోధన్‌లో నెలకొన్ని పరిస్థితులు, బంద్.. తదితర అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ.. భారత దేశంలో ఉందా..? లేక పాకిస్థాన్‌లో ఉందా..? అని నిలదీశారు.. కేసీఆర్ తన మహారాష్ట్ర పర్యటనలో ఛత్రపతి శివాజీని పొగిడారు.. కానీ, నిన్న బోధన్‌లో శివాజీ విగ్రహం అంశంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హిందువులపై దాడి చేశాయని ఆరోపించారు.. ఇక, దాడులకు…
కేంద్రంపై మరోసారి పోరుకు సిద్ధమైంది టీఆర్‌ఎస్ పార్టీ.. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై చర్చించనున్నారు. యాసంగి ధాన్యాన్ని వందశాతం కేంద్రం ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడిచేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. Read Also:…
తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కాబోతోంది.. రాష్ట్రవ్యాప్తంగా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయబోతున్నామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఒకేసారి 91 వేలకుపైగా ఉద్యోగాల భర్తీని ప్రకటించిన ఆయన.. వరుసగా నోటిఫికేషన్లు ఉంటాయని వెల్లడించారు.. ఇక, పలు జిల్లాల్లో నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు.. ఆరు నెలలు సినిమాలకు, సోషల్ మీడియాకు, మొబైల్ ఫోన్లకు.. దూరంగా ఉండడం.. కష్టపడండి.. మీ తల్లిదండ్రుల కలను…
All Political Parties Preparing for Elections. తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహ రచన చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు మైకుల ముందు మేమంటే మేము అంటూ.. మైకుల పగిలేలా స్పీచులు ఇచ్చిన నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ప్రత్యర్థులకు ఆలోచనలకు అందకుండా వ్యూహాలు రచించేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఇతర పార్టీలు ఉన్నా.. తారాస్థాయి పోరుమాత్రం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్యనే ఉండబోతోంది. ఇటీవల చేసిన కొన్ని…
నేడు భారత్-అస్ట్రేలియా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. ఖనిజాల రంగంలో భారత్-అస్ట్రేలియా మధ్య ఎంవోయూ. నేడు ఏపీ అసెంబ్లీలో పలు సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై నేడు స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. నేడు నిజామాబాద జిల్లాలోని బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. అయితే బీజేపీ బోధన్ బంద్‌కు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఎవరూ షాపులు మూసివేయవద్దని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి బలమయిన ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో బండి సంజయ్ అనేక అంశాలు ప్రస్తావించారు. రెండేళ్ళ పదవీకాలం చాలా సంతృప్తినిచ్చింది. అందరి సహకారం, నేతల సలహాలతో లక్ష్యాల వైపు అడుగులేశా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని అధికారంలోకి తెస్తాం. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో మేం గెలిచాం. టీఆర్ఎస్ డబ్బులు బాగా ఖర్చుపెట్టింది. నియోజకవర్గాలు అన్నింటిలో మేం పోటీచేశాం. మాకు నాయకులు తక్కువ…
నిధులు లేకున్నా పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారట ఆ ఎమ్మెల్యే. వాటికి భారీగా ప్రచారాలు చేసుకోవడం ఇప్పుడు చిక్కొచ్చి పడింది. స్వపక్షానికి.. విపక్షాలకు ఆ ఎమ్మెల్యే టార్గెట్ అయ్యారు. కాసులు లేకుండా కితకితలెందుకని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నిధులు లేకుండా అభివృద్ధి పనులకు భూమి పూజలుయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్య ఆలేరులో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.…
ఎల్లారెడ్డి బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు, జనం. దారి పొడవునా రేవంత్ రెడ్డికి భారీ స్వాగతాలు లభించాయి. గ్రామాలలో, పట్టణాలలో రోడ్డుకు ఇరువైపులా రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికారు ప్రజలు. భారీ గజ పూల మాలలతో, మంగళ హారతులు, తిలకాలు దిద్దారు. రేవంత్ రెడ్డికి స్వాగతం చెప్పారు. ఎల్లారెడ్డి ఆర్టీసీ గ్రౌండ్ లో మన ఊరు, మన పోరు బహిరంగ సభ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కి మన ఊరు మన…