తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ముస్లింలకు పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెల నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 2 నుంచి మే2 వరకు రంజాన్ ఉపవాసాలు జరుగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ వెలుసుబాటు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.…
ప్రాణహిత పుష్కరాలకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 13 నుండి అత్యంత పవిత్రమైన ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ నుండే కాకుండా ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఏపీ…
పంచాంగంలో ఏముందో కానీ సంతోష్ కుమార్ శాస్త్రి నోటి నుండి శుభం మాటలు వచ్చాయి.. వ్యక్తిగతంగా నాకు సంతృప్తిగా ఉంది.. సర్వ జనులకు సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాక్షించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ప్రగతిభవన్‌లో ఉగాది వేడుకలు సందడిగా జరిగాయి.. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తదితరలు పాల్గొన్నారు.. సీఎం కేసీఆర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ…
తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రేవంత్ కేసీఆర్ పై తీవ్రంగా స్పందించారు. పంచాంగ పఠనం, ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతుల జీవితంపై మరణ శాసనం రాశాడు కేసీఆర్ అన్నారు రేవంత్. కోడికి ధర తక్కువ.. మసాలాకే ధర ఎక్కువ అయ్యిందంటూ పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్ నిజానికి 50 రూపాయలకే వస్తుంది. కానీ, కేసీఆర్ 35 రూపాయలు, మోడీ 30 రూపాయలు…
తెలంగాణలో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రగతి భవన్ జనహితలో ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. వేడుకలకు మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వేదపండితులు సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించారు. పంచాంగ పఠనం ప్రారంభించిన బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి కొత్త సంవత్సరం ఎలా వుండబోతోంది అనేది వివరించారు. వేములవాడ రాజన్న ప్రభ మళ్ళీ వెలుగబోతుందన్నారు. ఈ సంవత్సరం ఎక్కువ మంచి జరగబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిపాలన అందిస్తారు. పంటలు అద్భుతంగా పండబోతున్నాయి.…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతిచెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే చికిత్సకు సహకరించక పోవడంతో శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతతో మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక…
తెలంగాణ సీఎం కేసీఆర్-గవర్నర్ తమిళిసై మధ్య గ్యాప్ క్రమంగా పెరుగిపోతోందనే వార్తలు వస్తున్నాయి.. గవర్నర్ ప్రసంగంలేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడంపై పలు విమర్శలు వచ్చాయి.. అయితే, ఇవాళ రాజ్‌భవన్ వేదికగా జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రాజ్ భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు.. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు.. ఇక, వివిధ పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్ర…
సీఎం కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు చాలా విరుద్ధమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ సీఎం అయ్యాడని, దళితుల, బీసీల, మైనారిటీల సంక్షేమం కోసం మార్చాలి అంటున్నారని, కానీ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 9 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, సీఎం చేసిన వ్యాఖ్యలు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ఏప్రిల్ 9న నిరసనకు అనుమతి…
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేసిన సీఎం.. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని పేర్కొన్నారు.. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ…