తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సుని నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర లాభసాటి పంటల్ని సాగు చేయాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి పెట్టి, పంటల సాగులో ఆదర్శంగా నిలవాలన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి,…
తెలంగాణలో రైతు సంఘర్షణ యాత్రకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని వరంగల్‌లో ఈ సభ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పదేళ్ళ పాలనలో ఉన్నప్పటికీ, రాష్ట్రానికి పెద్దగా చేసిందేమీ లేదని ఆరోపించారు. అప్పుడు వ్యవసాయానికి మూడు విడతల్లో ఏడు గంటల కరెంట్ ఇచ్చారని, విత్తనాలు ఎరువుల కోసం చెప్పులు పెట్టి మరీ లైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు…
అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండిసంజయ్ లేఖ రాశారు. వరిధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నా మీ ప్రభుత్వం దున్నపోతుపై వాన పడ్డ చందంగా వ్యవహరించిందని అన్నారు. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 74 లక్షల మెట్రిక్…
తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరి ప్రశ్నకు సమాధానం ఇస్తూ సోషల్ మీడియాలో అలర్ట్ గా వుంటారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రతిపక్షాలు గజగజ వణకాల్సిందే. ఆయన ప్రజల మనిషని, ప్రజలకై పోరాడతారనేది తెలంగాణ ప్రజల నమ్మకం. ఈనేపథ్యంలో.. ప్రజల తరపున కేటీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్…
ఎప్పుడూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగే తీన్మార్ మల్లన్న ఇక నుంచి తాను సీఎం కేసీఆర్‌ను తిట్టనని శపథం పూనారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిన్న నిర్వహించిన ‘7200 మూవ్‌మెంట్’ సన్నాహక సమావేశానికి తీన్మార్ మల్లన్న హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని, అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాడతానని ప్రకటించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే తన…
యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గత ఏడాది హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడలేదు అలా పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కులి పోయేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల వర్షానికే క్యూ లైనులు, రోడ్లు, గుడికి ఎదురుగా చెరువు తయారు అయింది అంటే ఎనమిది ఏండ్లగా నువ్వు ఇరవై సార్లు వచ్చి ఏమి చేశావు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరా కాంట్రాక్టర్, సినిమా ఆర్ట్…
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడింది కేసీఆరేనని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. మద్యం, డబ్బులు ఎన్ని కురిపించినా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్న వ్యక్తికి విజయం ఖాయని తెలిపారు.. రాష్ట్రంలో కేసీఆర్ అంటే అసహ్యించు కొంటున్న వారు నాకంటే ఎక్కువగా మీకు తెలుసని సెటైర్లు వేసిన ఆయన.. కాంగ్రెస్ కు ఓటు…
రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సమస్యను తెలంగాణలో కేసీఆర్ సృష్టిస్తున్నాడని, నష్టపోయిన రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. తూతూ మంత్రంగా చర్యలతో తప్పించుకుంటాం అంటే.. వదిలే ప్రసక్తే లేదని, కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. నీ దుష్ట, మూర్ఖపు, నీచమైన పాలనలో ఈ ఏడేళ్లలో ఏనాడు రైతన్నను ఆదుకోలేదని, రాష్ట్ర…
రైతుల సౌకర్యార్థం అవకాశం ఉన్న ప్రతి చోట వ్యవసాయ మార్కెట్ నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా…
కేసీఆర్ ప్రతి రోజూ ఉదయాన్నే సీఎం జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్నారు. జగన్ వైఖరి వల్ల.. ఏపీలోని విద్యుత్ కోతల వల్ల ఏపీ నుంచి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నాయి.. ఇక కొత్త పరిశ్రమలు రావడానికే భయపడుతున్నాయి. ఏపీలోనే సోలార్ పవర్ రూ. 2కే లభ్యమవుతోంటే.. అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటి.?ఎక్కడైనా పెద్దోడ్ని కొట్టి.. పేదోడికి పెడతారు..…