పాలమూరులో బీజేపీకి వస్తున్న విశేష స్పందన, సభలకు వస్తున్న ప్రజలను చూశాక టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ నేతలకు నోటికి దురద పెట్టినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ సన్నాసుల్లారా… 8 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రజలకు చేసిందేమిటి? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఆంధ్రా పాలకులకు అమ్ముడుపోయిన సన్యాసులు టీఆర్ఎస్ నేతలని మండి పడ్డారు. ఆంధ్రుకు అమ్ముడుపోయి తెలంగాణకు తాకట్టు పెట్టారని అన్నారు.
ఈ సన్నాసులకు.. నా గురించి, బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని మండిపడ్డారు. మీ అవినీతి, అక్రమాలను చూసి దేశం నేర్చుకోవాలా? సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు దోచుకున్న డబ్బునంతా బీజేపీ కక్కించి తీరుతుందని అన్నారు. ఇసుక, మట్టి గుట్టలు, భూములన్నీ మాయం చేస్తున్న ఈ సన్నాసులా మాకు చెప్పేది? అంటూ డి.కె. అరుణ మండిపడ్డారు. జడ్చర్లలోని వెంకటేశ్వర స్వామికి చెందిన 120 ఎకరాల దేవాలయ భూములను కూడా కబ్జా చేసిన దుర్మార్గులు టీఆర్ఎస్ నేతలేనని ధ్వజమెత్తారు.
Bandi Sanjay : టిఆర్ఎస్ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారు