రాహుల్ గాంధీ అతి ధైర్యం, పట్టుదలతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా ఆర్థికవేత్తకు అవకాశం ఇచ్చారని రాహుల్‌ను వీహెచ్ కొనియాడారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇవ్వొచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్‌తో వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)గా మార్చడంతో పాటుగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకు శుభవార్త… ఇవాళ్టి నుంచి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తున్నారు.. తెలంగాణలో ఇవాళ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించారు… డిసెంబర్ వరకూ 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందించనుంది ప్రభుత్వం.. రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చే బియ్యానికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి మొత్తం ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని…