BJP Vishnuvardhan Reddy : దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీకి తేడా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ఇటీవల ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతాయనే వాదన వినిపిస్తూనే ఉంది. అయితే.. మరొపక్క బీఆర్‌ఎస్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీ తేడా లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. స్పష్టమ్తెన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టాడని, కేసీఆర్ దోచివేసిన సొమ్ముతో ఏపీలో ప్లెక్సీలు కడుతున్నారు అంటూ ఆయన విమర్శించారు. తెలుగుతల్లికి క్షమాపణ చెప్పి ఏపీలోకి కేసీఆర్ అడుగుపెట్టాలని, ఎందరో మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేశారు. వీరి కుటుంబాలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణా తల్లిని కర్నాటక, మహారాష్ట్ర , యూపీ , తమిళనాడు,ఏపీకి ఎలా తెస్తారో చెప్పాలి. దేశాన్ని ఏకం చేసే కెసిఆర్ ఏపిలో నీటి ప్రాజెక్టులప్తె తన వ్తెఖరిని ప్రకటించాలి. ఏపీతోనే వివాదాలు ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలను ఎలా మెప్పిస్తారు…!
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల గణాంకాలకు , భారత ప్రభుత్వం గణాంకాలను పొంతన లేదు. 12 నెలల్లో చేయాల్సిన అప్పులను ఏపి ప్రభుత్వం 6 నెలల్లో చేస్తోంది. జీతాలు రాక ఉద్యోగాలు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చెప్పే వాటికి చేసే వాటికి పొంతన లేకుండా పోతోంది. ఆర్థికపరమ్తెన విషయాల్లో దొంగ లెక్కలు రాయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. ఏపీకి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టాల్సి వస్తోంది. ఇంకొకసారి వ్తెసీపీ అధికారంలోకి వస్తే జిల్లాలను మరొక రాష్ట్రానికే అమ్మేసే పరిస్థితి వస్తుంది. ఆర్థికపరమ్తెన విషయాలలో వ్తెసీపీ ప్రభుత్వం శ్వేతప్రతం విడుదల చేయాలి. ప్రజాపోరు ప్రచార రథం ప్తె బొమ్మనహాళ్లులో వ్తెసీపీ నేతలు దాడి చేసి , తిరిగి మా కార్యకర్తలప్తెనే కేసులు పెట్టారు. వ్తెసీపీ నేతలు చేసిన తప్పులకు కేసులు పెట్టాలంటే జైళ్లు సరిపోవు అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!