తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతు వేదికలను ప్రారంభించింది.. మండల కేంద్రాల్లో రైతులు సమావేశమై.. వారి సమస్యలు, పంటలు, రైతుబంధు.. ఇలా అనేక విషయాలను చర్చించుకునేందుకు వీలుగా ఈ వేదికలు నిర్మించింది ప్రభుత్వం.. ఇక, రైతు వేదికల వలె మహిళా వేదికలు కూడా నిర్మించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.. రాష్ట్రంలో మహిళలను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రైతు వేదికల మాదరిగా మహిళా వేదికలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని…
సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్ ల ఆశీర్వాదం తీసుకుని, మాట్లాడుతా.. ఒక మంచి ఎంపీ బండి సంజయ్…
కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో... కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, ఈ ముగింపు సభను పెట్టుకున్నామని ప్రజలనుద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఈటల మాట్లాడారు.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. వైసీపీ గెలుపునకు అన్ని విధాలా సహకరించారు. తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహాన్ని.. త్వరలో ఏపీలోనూ అమలు చేసే దిశగా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బీజేపీకి, మరోవైపు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తర్వాత…
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్.. దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు.
దేశ రాజకీయాల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం పాటుపడిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.