BRS Kisan Cell President Gurnam Singh Comments: దేశంలో పెద్ద మార్పు రావాలని, పేదలు,రైతులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు లేవని అన్నారు భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు,పేదలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బంధు,రైతు భీమా సహా అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని.. తెలంగాణలో అందుతున్న సంక్షేమ ఫలాలు యావత్…
తెలంగాణలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బహిరంగ సవాల్ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను…
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని.. తెలంగాణ రైతులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, వారితో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు కేంద్రం వైఖరికి నిరసనగా ఉద్యమించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
CM KCR will visit Maharashtra in ten days, Minister Indrakaran Reddy: భారత రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం కేసీఆర్. ఇప్పటికే వచ్చే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఈ రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహారాష్ట్రలో పర్యటించారు. నాందేడ్ జిల్లా కీనిలో ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలతో సమావేశం అయ్యారు. తెలంగాణలో రైతులు…
బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అది పేదల కోసమేనని అన్నారు.
చెప్పుతో కొడితే కొట్టించుకుంటా.. తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికలు,పార్టీ సంస్థాగత బలోపేతం కోసం పార్టీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.