తెలంగాణ మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
CM KCR Key Meeting: ఎల్లుండి తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. ఈ సమావేశం జరగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో.. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ కార్యకలాపాలతో…
బెదిరింపు వ్యూహాలు మమ్మల్ని అడ్డుకోలేవని, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని రాజకీయ భాగస్వామ్యంలో మహిళలకు సముచిత భాగస్వామ్యాన్ని కల్పించేందుకు దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా ఏకైక డిమాండ్ అన్నారు.
ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీస్ ల పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.