తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ఏడాది దృష్ట్యా పార్టీ కార్యాచరణ, ప్రతిపక్షాలను ఎదుర్కోవడంపై నేతలకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. కాగా, కవితకు ఈడీ…
ఈరోజు భారత రాష్ట్ర సమితి, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది.
కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు నన్ను కెలకాలనుకుంటున్నాడు నేను ఊరుకుంటనా అంతకంటే ఎక్కువ కెలుకుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వాఖ్యలు చేశారు.