CM KCR: తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభవార్త అందించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఆటో సంబంధిత ఫిట్‌నెస్ ఫీజులు, సర్టిఫికెట్ల జారీ ఫీజులను మాఫీ చేస్తామని ప్రకటించారు.
CM KCR: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారానికి వినియోగించిన బస్సును సోమవారం కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మాన్‌కొండూరులో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ జన్ ఆశీర్వాద సభకు హాజరుకానున్నారు.
CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ స్టేషన్‌ఘన్‌పూర్‌కు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్-వరంగల్ హైవేలోని మేడికొండ క్రాస్ రోడ్డు వద్ద శివారెడ్డిపల్లి శివారులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
Priyanka Gandhi: కర్ణాటక గురించి మాట్లాడటం కాదు.. 10ఏళ్లుగా తెలంగాణలో ఏం చేశారు కేసీఆర్ గారూ.. అంటూ ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. " కాంగ్రెస్ విజయభేరి యాత్ర " ఖానాపూర్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..
Bandi Sanjay: కేసీఆర్ సారూ.. 31 ప్రశ్నలకు జవాబు చెప్పి ఓట్లు అడగాలని ఎంపీ బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రముఖ్యమంత్రిగా.. బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మీ 9 ఏళ్ల పాలనలో ఒరగబెట్టిందేమిటో 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్ అన్నారు. మీ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలలోకి పోతే మీ…
Revanth Reddy: ఐదు వేల పెన్షన్ ఇస్తా అని ఇప్పుడు అంటున్నారు కేసీఆర్.. మరి ఐదేళ్లు ఎందుకు ఇవ్వలేదు? అని టీపీసీసీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజాం రాజు లెక్క కేసీఆర్ మన మీద పెత్తనం చేలాయిస్తున్నారని మండిపడ్డారు.
Minister KTR: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో ఉదయం భద్రాచలం నగరానికి చేరుకుంటారు.