Minister KTR: నేడు భద్రాద్రిలో కేటీఆర్ పర్యటన.. రామాలయ దర్శనం, రోడ్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో ఉదయం భద్రాచలం నగరానికి చేరుకుంటారు. 11 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం ఉంటుంది. అనంతరం బీఆర్ ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తైలం వెంకట్రావు విజయాన్ని కాంక్షిస్తూ నగరంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇల్లెందు నగరానికి చేరుకుంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియానాయక్ విజయాన్ని కాంక్షిస్తూ అక్కడ రోడ్ షో నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా కేంద్రం కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడ బీఆర్ ఎస్ అభ్యర్థి వన్మా వెంకటేశ్వరరావు గెలుపు కోసం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటకు చేరుకుంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షోలో పాల్గొంటారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి రావడంతో పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మధు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలు ప్రజలతో ముఖాముఖి అన్నట్లుగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ నేతృత్వంలో జరుగుతున్న రోడ్ షోలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ప్రసంగాలు వింటున్నారు. కేటీఆర్ చెప్పిన దాని గురించి ఆలోచించి మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి నుంచి నిన్న రోడ్ షో నిర్వహించారు. ఓపెన్‌టాప్ బస్సులో పలు గ్రామాల ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. , కామారెడ్డి నుంచి కేసీఆర్ రాక సందర్భంగా రానున్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఏం జరుగుతుందో చెప్పారు
Bigg Boss 7 Telugu: ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్‌బాస్.. ఆ ముగ్గురి కోసమేనా?
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!