Revanth Reddy: ఐదు వేల పెన్షన్ ఇస్తా అని ఇప్పుడు అంటున్నారు కేసీఆర్.. మరి ఐదేళ్లు ఎందుకు ఇవ్వలేదు? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజాం రాజు లెక్క కేసీఆర్ మన మీద పెత్తనం చేలాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు స్వేచ్చ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం రాజునే తిరస్కరించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఆకలిని ఐనా భరించారు కానీ.. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిగే ఉరుకోలేదన్నారు. తెలంగాణ వాసన లేకుండా చేశారు కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో స్వేచ్ఛ.. సామాజిక న్యాయం జరగలేదన్నారు. మరో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల ప్రజలు కోరుకునే స్వేచ్ఛ..సమాన అభివృద్ధి ఇచ్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టో అని అన్నారు. ఎన్నికల మాదిరిగా కాకుండా ఉద్యమంగా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐదు వేల పెన్షన్ ఇస్తా అని ఇప్పుడు అంటున్నారు కేసీఆర్.. ఐదేళ్లు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఇచ్చే ఆదాయం ఉండగా.. ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. ఉచిత కరెంట్ పై పేటెంట్ కాంగ్రెస్ ది. చెప్పుకునేది లేక..కేసీఆర్ కాంగ్రెస్ తప్పుడు మాటలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Viral News: మనుషులకే దిక్కులేదు.. కోడికి బర్త్ డే వేడుకలేంట్రా నాయనా
ఏ సబ్ స్టేషన్ కి అయినా వెళ్దామని, ఆరు నెలల నుండి 24 గంటలు విద్యుత్ ఇచ్చారో తనిఖీ చేద్దామా? అని కేసీఆర్ కి రేవంత్ సవాల్ విసిరారు. విద్యుత్తు శాఖ మంత్రి నియోజక వర్గానికి అయినా సరే అన్నారు. సబ్ స్టేషన్ వెళ్లి రికార్డు చూద్దామా అన్నారు. ధరణి పేరుతో దళితుల 25 లక్షల ఎకరాల వెనక్కి తీసుకున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిజాం వారసుల భూములు.. తన సన్నిహితులకు, ప్రయివేట్ వ్యక్తుల పెరు మీద ట్రాన్స్ఫర్ చేశారు కేసీఆర్ అంటూ ఆరోపించారు. అందుకే ధరణి రద్దు చేస్తా అంటే భయమన్నారు. ధరణి రాకముందే రైతు బంధు రాలేదా..? అని ప్రశ్నించారు. రైతు బంధు ఎప్పుడు పెట్టారు? ధరణి ఎప్పుదు వచ్చింది ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ధరణి రాక ముందే వచ్చిన రైతు బంధు.. ఎలా అమలు అయ్యింది ? అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానిక్కి కేసీఆర్ మట్లాడుతున్నారని మండిపడ్డారు. అసహనంతో కేసీఆర్ మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012 నుండి 2014 వరకు సీమాంధ్ర నేతలు మాట్లాడినట్టే.. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం మాట్లాడుతుందన్నారు. మా మేనిఫెస్టో చూసి భయపడుతున్నాడు కేసీఆర్ అన్నారు. మూడో సారి అధికారంలోకి వస్తాము.. మనవణ్ణి మంత్రి చేస్తా అనుకునే కేసీఆర్ మా మేనిఫెస్టో చూసి ఎందుకు భయపడుతున్నాడు? అని ప్రశ్నించారు. కాలేశ్వరం పై విచారణ చేస్తాం.. . అంచనాలు.. క్వాలిటీ లపై విచారణ చేస్తామన్నారు.
Bussiness Idea : రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్న పంటలు ఇవే..