Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandisanjay Asked 31 Questions To Cm Kcr

Bandi Sanjay: కేసీఆర్‌ సారూ.. 31 ప్రశ్నలకు జవాబు చెప్పి ఓట్లు అడగండి..

Published Date :November 19, 2023 , 1:27 pm
By Bhanu
Bandi Sanjay: కేసీఆర్‌ సారూ.. 31 ప్రశ్నలకు జవాబు చెప్పి ఓట్లు అడగండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay: కేసీఆర్‌ సారూ.. 31 ప్రశ్నలకు జవాబు చెప్పి ఓట్లు అడగాలని ఎంపీ బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రముఖ్యమంత్రిగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా మీ 9 ఏళ్ల పాలనలో ఒరగబెట్టిందేమిటో 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్‌ అన్నారు. మీ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలలోకి పోతే మీ అసమర్థ పాలనపై 1000 ప్రశ్నలను అడిగినా సరిపోదన్నారు.

బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా, నిరంతరం ప్రజల కోసం నిరంతరం పాటుపడే బీజేపీ 4 కోట్ల తెలంగాణ ప్రజల తరుపున అడుగుతున్న ఈ 31 ప్రశ్నలకు కనీసం ఈ ఎన్నికల సందర్భంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీరు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా, పార్టీగా మీరు ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నామన్నారు.

బండి సంజయ్‌ 31 ప్రశ్నలు ఇవే..

1. మీకు నిజం చెప్పకూడదు అన్న శాపం ఏమైనా ఉందా? ఏనాడు మీరు నిజాలు చెప్పరు? అందుకే అబద్ధాలతో ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా?
2. కేంద్రహోం మంత్రి శ్రీ అమిత్‌షా గారు నిన్నటి రోజు 48 పేజీలతో తెలంగాణ బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోను తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రతీ అంశాన్ని తప్పకుండా అమలు చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. మీరు 2023 లో 13 పేజీలు, 2018 లో 16 పేజీలు, 2014 లో 32 పేజీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసి మీరు అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ఎన్ని అమలు చేశారు? ఎన్ని అమలు చేయలేదు? దీనిపై బిజెపి ప్రతినిధులతో చర్చించడానికి మీరు సిద్ధమా? సమయం, స్థలం మీరే నిర్ణయించి చెప్పండి.
3. అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన మీరు, మీ అబద్ధాలు, తప్పుడు వాగ్ధానాలు, హామీలు ప్రజలు తెలుసుకున్నారనే ఉద్ధేశ్యంతోనే ప్రతీ ఎన్నికలకు విడుదల చేస్తున్న మీ మ్యానిఫెస్టో పేజీలు కూడా తగ్గిపోతున్నాయి. ఇది వాస్తవం కాదా?
4. కాంగ్రెస్‌`ఎంఐఎం తో మీరు లోపాయికారి ఒప్పందం, మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకున్న ఒప్పందం వాస్తవం కాదా? మీ పార్టీ గుర్తు స్టీరింగ్‌ మజ్లీస్‌ చేతులో ఉందా లేదా? హస్తంతో లోపాయకారి దోస్తి, బయటకు మాత్రం కుస్తి. దీనికి మీ జవాబు ఏమిటి?

5. ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసిన మీరు … మీ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇది వాస్తవం కాదా? దీనికి మీ సమాధానమేమిటి?
6. ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు 1వ తేదీన మీ పాలనలో జీతాలు అందుతున్నాయా?
7. 2014 లో మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారు? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎన్నిసార్లు పేపర్ల లీకేజు కారణంగా పరీక్షలు రద్దు చేశారు? దీనిపై నిరుద్యోగులకు సమాధానం చెప్పగలరా?
8. 2018-2023 వరకు నిరుద్యోగ భృతి రూ.3,016/-లు (నెలకు) చొప్పున ఇప్పటి వరకు తెలంగాణలో ఎంత మందికి విద్యావంతులైన యువతకు ఇచ్చారు?
9. 2014 లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సెక్రటేరియట్‌కు ఎన్నిసార్లు, ఎన్నిరోజులు వెళ్ళారు? మీరు ఫామ్‌హౌస్‌లో ఎన్నిరోజులు ఉన్నారు?
10. ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రిగా మీకు పేరున్న మాట వాస్తవం కాదా?

11. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని 2014 లో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్‌ నెం.7లో మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 9 సంవత్సరాల కాలంలో ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో మీరు వివరాలు అందించగలరా?
12. రైతులకు లక్షరూపాయలు రుణమాఫీ చేస్తామని 2014, 2018 ఎన్నికల్లో మీరిచ్చిన హామీ ఎంతమేరకు నెరవేర్చారు? మాకున్న సమాచారం ప్రకారం ఇంకా లక్షలాది మంది రైతులకు రుణ మాఫీ చేయాల్సి వుంది. దీనికి మీ సమాధానం ఏమిటి?
13. వరి వేస్తే ఉరి అని, రైతాంగాన్ని భయబ్రాంతులకు గురిచేసి రైతులు వరి పండించకుండా అడ్డుకుంది మీరు కాదా? తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచి ఆ నెపాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నెట్టడానికి ప్రయత్నించడం మీ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా?
14. ‘‘కేసీఆర్‌ జమానా ` అవినీతి ఖజానా’’ అనే సకలజనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు. ప్రగతిభవన్‌ అవినీతి భవన్‌గా, తెలంగాణ ద్రోహులకు నిలయంగా మారిందన్నది వాస్తవం? దీనికి మీ జవాబు ఏంటి?

15. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కేసీఆర్‌ అని పేరుంది. దీనికి మీరు స్పందించి మీ నిజాయితీని, సచ్ఛీలతను నిరూపించుకుంటారా?
16. మీ కుటుంబసభ్యులు, మీ బంధువులు, మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఇసుక, లిక్కర్‌, డ్రగ్స్‌ దందాలు, భూకబ్జాలపై సి.బి.ఐ లేదా సుప్రింకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తుకు మీరు సిద్దమా?
17. ఓటుకు నోటు పథకాన్ని ప్రవేశపెట్టి మీరు సంపాదించిన కోట్ల రూపాయల అక్రమ సొమ్ముతో ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మాట వాస్తవం కాదా?
18. బంగారు తెలంగాణ చేస్తానని, అక్రమ మార్గాల ద్వారా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ పార్టీ వారిని బంగారు మయం చేసి ప్రజలను బికార్లుగా మార్చిన ఘనత మీది కాదా..?
19. 2014లో మీరు ముఖ్యమంత్రి పదవిచేపట్టే నాటికి మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యుల,
మీ బంధువుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా?దీనిపై చర్చకు మీరు సిద్ధమా?
20. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రీడిజైనింగ్‌ పేరిట అంచనాలు పెంచి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా లేదా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతరసాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, విద్యుత్‌ ప్రాజెక్టుల, విద్యుత్‌ కొనుగోళ్లు, ప్రభుత్వ భూములు అమ్మకాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దీనిపై చర్చించడానికి మీరు ముందుకువస్తారా?

21. 2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేజీ నెం.14లో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనే అంశం కింద ‘‘ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని మీరు హామీ ఇచ్చారు. ఈ 9 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించారు? ఎంత మంది పేదలకు ఇచ్చారు? వీటికి లెక్కలు చెప్పగలరా?
22. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 91 వేల ఇండ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేస్తే, అందులో ఎన్ని ఇండ్లను పూర్తి చేశారు? వాటి వివరాలను ఇవ్వగలరా?
23. గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించారు..? మిగితా 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించారు? వీటి వివరాలు తెలంగాణ ప్రజలకు తెలుపుగలరా?
24. నిజాం షుగర్‌ పునరుద్ధరణ, నిజామాబాద్‌ జిల్లాలో చెరుకు పరిశోధనా కేంద్రం, పాలమూరు జిల్లాలో చేపల పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైంది? దీనికి మీ జవాబు ఏమిటి?
25. దేశంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి, తెలంగాణలో ఎంత ఉంది? దీనిపైన చర్చించడానికి మీరు సిద్దమా?

26. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడని ఉద్యమకాలంలో మీరు అనేక సార్లు బహిరంగంగా ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మాట మీద నిలబడకుండా దళితులను నిట్టనిలువునా మోసగించిన మాట వాస్తవం కాదా?
27. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మీ 9 సంవత్సరాల పాలనలో వారిని మోసగించిన మాట వాస్తవం కాదా?
28. రాష్ట్రచరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు ద్రోహం చేసింది మీరు కాదా? మీరు బీసీ ద్రోహులు. బీసీ, ఎంబీసీ కార్పోరేషన్లకు మీ హయాంలో కేటాయించిన నిధులు ఎంత? వాటిలో ఖర్చు చేసిందెంత? మళ్లించినదెంత? దీనిపై చర్చకు సిద్ధమా? ఆత్మగౌరవ భవనాలను ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయి?
29. 2014 నుండి 2023 వరకు కేంద్రంలోని శ్రీ నరేంద్రమోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం నుండి వివిధ సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు మంజూరు చేసింది, ఎన్ని నిధులు వచ్చాయి తదితర అంశాలపై మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ చర్చకు మీరు సిద్ధమా?
30. కృషా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా 299 టీఎంసీలు నీటి వాటాకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి మీరు తీరని ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా?
31. గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు మీ ప్రభుత్వం 9 ఏళ్లల్లో తీసుకున్న చర్యలు ఏమిటి? అని ప్రశ్నించారు.
Revanth Reddy: ఐదు వేల పెన్షన్.. ఐదేళ్లలో ఎందుకు ఇవ్వలేదు..? కేసీఆర్ కు రేవంత్‌ ప్రశ్న..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandisanjay asked 31 questions
  • Bandisanjay asked 31 questions to CM KCR
  • BRS vs BJP
  • cm kcr
  • telangana elections 2023

తాజావార్తలు

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Trump-Sanae Takaichi: ట్రంప్‌తో జపాన్ ప్రధాని భేటీ.. షాకింగ్ ప్రశ్నకు అసౌకర్యానికి గురైన సనాయే తకైచి

  • “Dhurandhar The Revenge” చిత్ర యూనిట్‌కు బిగ్‌ షాక్.. విడుదలైన ఫస్ట్ డేనే పాకిస్థాన్‌లో పైరసీ కాపీ ప్రత్యక్షం!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

ట్రెండింగ్‌

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions