శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ మోహాన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని తెలిపారు. అవ్వా తాతలకు ఇంటి వద్దకే పింఛన్, రేషన్, పథకాలు, పౌర సేవలు తలుపుతట్టి అందిస్తున్నాని అన్నారు. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మహిళలకు, మత్స్యకారులు, నేతన్నలకు తోడుగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు.. మూలపేట పోర్టు కడుతున్నాం.. భోగాపురం ఎయిర్ పోర్ట్, ఉద్దానం కిడ్ని సమష్యకు పరిష్కారం చూపించే…
ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మంచి చేసే వారికే మద్దతు ఇవ్వాలని, ఉన్నతమైన విలువలు, నీతి, నిజాయతీ కలిగిన నాయకులకు మీ ఆశీస్సులు అందించి ఆశీర్వదించండని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.
కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా కుమారుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ తన తండ్రి కోసం పల్లె పల్లెను పలకరిస్తూ.. ప్రజలతో మమేకమౌతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రధాని మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండుచోట్ల నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొ్న్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా.. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై మోడీ, చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు…
ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలి.. కృష్ణా జిల్లా మచిలీపట్నం మేమంతా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతోంది.. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక కోసం జరిగే ఎన్నికలు కాదన్నారు. ఇంటింటికి భవిష్యత్లో పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అమలు కాని హామీలు అని…
కృష్ణా జిల్లా మచిలీపట్నం మేమంతా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతోంది.. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక కోసం జరిగే ఎన్నికలు కాదన్నారు. ఇంటింటికి భవిష్యత్లో పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అమలు కాని హామీలు అని విమర్శించారు. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో…
ప్రతి ఇంటికి వెళ్తుంటే వాలంటరీలు ఉన్నప్పుడు మాకు పెన్షన్ మా గడపకే తెచ్చేవారు అని చెబుతున్నారు.. మేము మళ్ళీ జగనన్న గెలిపించుకుంటామని చెప్తున్నారని కేశినేని శ్వేత అన్నారు.
ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయమని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దూలం నాగేశ్వరరావు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతున్నానని తెలిపారు.
ఏపీలో ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరు పెంచుతున్నారు. ఇటీవల నామినేషన్ ప్రక్రియ సైతం ముగిసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఉన్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రెండవ దశ ప్రచార పర్యటనలో భాగంగా…