పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలే.. పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అని.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనన్నారు. చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడని విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ, అమిత్…
శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
కేసీఆర్ బస్సు యాత్రలో చేతివాటం.. డిప్యూటీ మేయర్ బంగారం, కౌన్సిలర్ డబ్బు చోరీ.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో స్టార్ ప్లానర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్ షోలో…
తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి పవిత్రతను కాపాడటానికి ప్రజలందరు సిద్ధంగా ఉండాలని కోరారు. తనది పునర్జన్మ.. వేంకటేశ్వర స్వామీ తనకు పునర్జన్మ ఇచ్చాడని అన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వారు పోటీ చేసిన గొప్ప…
తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గోవిందా.. గోవిందా అంటూ స్పీచ్ మొదలెట్టారు. అన్నీ సర్వేలు కూటమిదే విజయం అంటోందని తెలిపారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ ను ఎమ్మెల్యేగా గెలిపించడం అవసరమా అని…
ఏపీలో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది. కొద్ది రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతో వడగాల్పులకు ఇబ్బంది పడిన ప్రజలు…
విశాఖలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓల్డ్ గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనేనని తెలిపారు. విశాఖను రాజధానిగా చేయడమే కాదు.. జూన్ 4న ప్రమాణ స్వీకారం, పాలన చేసేది ఇక్కడ నుంచేనని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్ళుగా పేదలపై భారం మోపుతూ.. బాదుడే బాదుడు అని ఆరోపించారు. ఏడుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు.. రెండు వందలు వస్తున్న కరెంట్ బిల్లు వెయ్యి దాటి రెండువేల వరకు వెళ్ళిందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోలు ధరకు ఆఖరికి చెత్త పన్ను వేశాడని సీఎం జగన్ పై దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికలకు ఏదో ఒక…
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. పేదల వైపు ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెత్తందారుల వైపు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి జగన్కు నష్టం చేయాలని చూస్తున్నాయని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్…
రాష్ట్రానికి వస్తున్న మోడీ గారు.. ప్రజా పక్షాన కొన్ని ప్రశ్నలు.. కేటీఆర్ ట్విట్ పిరమైన ప్రధాని @narendramodi గారు.. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కొన్ని ప్రశ్నలను సంధించారు. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండని తెలిపారు. శాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి..!! అన్నారు. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి..!! అని…