ఏపీలో కోవిడ్–19 నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో ఎల్లుండి (బుధవారం) నుంచి ఆంక్షలు మొదలు కానున్నాయి. బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు ఓపెన్ ఉంటాయని.. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే నడువనున్నాయి. రెండు వారాల పాటు…
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. ఎలాగైనా నిర్వహిస్తామని ఏపీ సర్కార్ అంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ పది, ఇంటర్ పరీక్షలపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశామని హై కోర్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ పునరాలోచించాలని తెలిపింది. పక్క రాష్ట్రాలలో పరీక్షలు వాయిదా వేస్తే..…
కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్లు ఉన్నారు. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో రెండో డోస్ ఇవ్వాలి. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వాక్సిన్లు కావాలి. తొలి డోస్ ఇప్పటి వరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే వేశారు. 2.60 కోట్ల మందికి ఇప్పటి వరకు రెండో డోస్ మాత్రమే వేశారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటి వరకు…
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. మే 1 తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని… ఏపీలో 2 కోట్ల 4 లక్షల మంది 18-45 ఏళ్ల వయసున్న వారు ఉన్నారని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. టీకాల కోసం వివిధ కంపెనీలతో మాట్లాడామని..ఉత్పత్తిలో సగం కేంద్రానికి ఇవ్వాలి ఆ తర్వాతే రాష్ట్రాలకు ఇవ్వాల్సి…
ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో కోవిడ్ నిర్ధారణ కోసం చేయించుకునే స్కానింగ్ ధరలను నియంత్రించింది ఏపీ ప్రభుత్వం. సీటీ స్కాన్, హెచ్చార్ సీటీ స్కాన్ ధరను రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులతో పాటు ఆస్పత్రుల్లోనూ సీటీ స్కాన్ నిమిత్తం రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని…
ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22వ సంవత్సరానికి అవసరమైన ఎరువుల కొనుగోళ్లు, సరఫరాకు విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఎరువుల కొనుగోళ్లకు అవసరమైన నిధుల కోసం ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల కొనుగోళ్లు, సరఫరా, బఫర్ స్టాక్ కోసం రూ. 500 కోట్ల మేర రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మార్క్…
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో ఒడిషా సహకారం కోరుతూ జగన్ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణం విషయంలో ఒడిషాతో సంప్రదింపులకు సిద్దమన్న ఏపీ సీఎం…చర్చలకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ను సమయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఒడిషా రైతులకూ లబ్ది చేకూరుతుందని లేఖలో పేర్కొన్న సీఎం జగన్… ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు, ఒడిషాలోని గజపతి…
వైఎస్ వివేకా హత్య ఘటన జరిగి రెండు యేండ్లు గడిచిన కేసు లో ఎలాంటి మార్పు లేదు. కానీ ఈ కేసు.. ఏపీ రాజకీయాలను రోజుకో మలుపు తింపుతోంది. ఈ కేసులో టిడిపి నాయకులు.. పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ వివేకా హత్య ఘటనపై సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాశారు. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు…తాజాగా…
ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. సెకండ్ వేవ్ కోవిడ్ తాజా పరిస్థితులు, కట్టడి, వైద్య చికిత్సా ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ పై సీఎం కీలక సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో…
సహకార శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకారశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరుపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 45 శాతం…