సీఎం జగన్ తండ్రినిమించిన తనయుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని…రెండు రోజులలో ఐదు లక్షల ఇళ్లకు శంఖుస్థాపన జరిగిందన్నారు.
read also : బీజేపీకి పెద్దిరెడ్డి గుడ్‌బై చెప్పబోతున్నారా?
లక్ష్యానికి రెండింతల ఇళ్లకు శంఖుస్థాపన చేసుకున్నామని..వై.ఎస్.ఆర్. తలపెట్టిన ఇళ్ల నిర్మాణం దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో పిచ్చుక గూళ్ళు కట్టా రని..అందులోనూ అవినీతికి పాల్పడ్డారని చురకలు అంటించారు. పేదలకు ఇళ్లకోసం రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఎకరాలు కొనుగోలు చేశామని… ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఇంటి స్థలాలకు కేటాయించామన్నారు. జగనన్న కాలనీల్లో నివాసయోగ్యమైన పరిసరాలు కల్పిస్తున్నామని.. పేదలకు ఇళ్లు ఇవ్వాలనే సీఎం జగన్ ప్రయత్నం ఓ మహాయజ్ఞమని కొనియాడారు.