ఏపీ ఆర్ధిక, రెవెన్యూ శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.ఇప్పటి వరకూ వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలు రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ డైరెక్టర్, ఐజీ కార్యాలయాలు, ఏపీ వ్యాట్ ట్రైబ్యునల్ లాంటి సంస్థలన్నీ ఆర్ధికశాఖ నియంత్రణలో పని చేస్తాయని స్పష్టం చేసారు. ఆర్ధిక వనరుల నిర్వహణను…
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉప్పినవలస ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. అయితే సొంతింటిలో బాబాయ్ హత్య జరిగాక జగన్ రాజకీయాలు చేశారు. జగన్ ను ఆదర్శంగా తీసుకుని వైసీపీ కార్యకర్తలందరూ అరాచకం సృష్టిస్తున్నారు. ఉప్పినవలసలో పట్టపగలు కత్తులతో సినిమా స్టైల్లో దాడి చేశారు. ఇలాంటి సంస్కృతిని శ్రీకాకుళం జిల్లాకు తీసుకొచ్చిన ఘనత స్పీకర్ తమ్మినేని సీతారాంకే దక్కింది. ఆడవాళ్లను సైతం మృగాళ్లలాగా కత్తులతో నరికారు…
వైసీపీ ప్రభుత్వం ఈ రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా బాధాకరం అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడే అర్.ఎ.ఆర్.ఎస్ భూములను మెడికల్ కాలేజీకి కేటాయించడం సబబు కాదు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట భీమా కింద రూ.12 వేల 52 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.900 కోట్లు మాత్రమే విడుదల చేసింది అని తెలిపారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది. గత…
ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటన పై ఉత్కంఠత నెలకొంది. ప్రభుత్వం విధానంగా పెట్టుకున్న సామాజిక వర్గాల కూర్పు లెక్కలు కొలిక్కి వచ్చాయి. అయితే రేపు వైఎస్సార్ రైతు దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉండటంతో ఎప్పుడు ప్రకటించాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. read also : ఇండియా కరోనా అప్డేట్.. 24 గంటల్లో 43,733 వైసీపీ ప్రభుత్వం సుమారు 80 వరకు కార్పొరేషన్లను త్వరలో ప్రకటించనుంది. పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీ జరుగనుంది. గత…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు లోకేష్. కరోనా మహమ్మారి నేపథ్యంలో 17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలని కోరారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు పరీక్షా క్యాలెండర్లు విడుదల చేశాయని పేర్కొన్న లోకేష్…. లక్షల మందికి సామూహికంగా ఒకేసారి పరీక్షల నిర్వహణ చాలా ప్రమాదమని పేర్కొన్నారు. read also…
కేబినెట్‌లో చోటుకోసం ఎదురు చూస్తోన్న వైసీపీ ఎమ్మెల్యేలను రెండున్నరేళ్ల గడువు ఊరిస్తోంది. జిల్లాల నుంచి ఆశావహుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. రేస్‌లో వెనకబడకుండా.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు శాసనసభ్యులు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అలాంటి వారిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా నుంచి కేబినెట్‌లో చోటుదక్కేది ఎవరికి? రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ఏర్పాటుకాగానే.. మొదటి జాబితాలోనే మంత్రి కావాలని ఆశించినవారు అనేక మంది. సీనియర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు సీరియస్‌గానే ప్రయత్నించారు.…
కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకూ కరోనా వాక్సినేషన్ ఇవ్వాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. వాక్సినేషన్‌లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన సీఎం జగన్… 45 సంవత్సరాలు దాటిన వారికి వాక్సినేషన్ 90 శాతం పూర్తైన తర్వాత… ఉపాధ్యాయులకు, మిగిలిన వారికి వాక్సినేషన్ ఇవ్వాలని ఆదేశించారు. read also : ఇంట్లోవారికి కరోనా సోకినా ఉద్యోగులకు…
అమరావతి : కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ లకు వేర్వేరుగా సీఎం జగన్ లేఖలు రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు వస్తామని కృష్ణా బోర్డు తరచు అడగటాన్ని తప్పుబట్టారు సీఎం జగన్. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ఏపీ చేసిన అభ్యర్థనను కేఆర్ఎమ్బీ పట్టించుకోవటం లేదని లేఖలో ఆక్షేపించిన సీఎం జగన్… తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాతే… రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించే…
ఏపీలో కరోనా కేసులు గత రెండు వారాల నుంచి తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆంక్షలు ఈ నెల 7 వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా.. అ తర్వాతి నుంచి కొత్త ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త ఆంక్షల ప్రకారం… తూ.గో, ప.గో జిల్లాల్లో ఉదయం 6 గంటల…