ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విఐటి-ఏపీ విశ్వవిద్యాలయం 50 లక్షల విరాళం
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని విఐటి ఫౌండర్ & ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ కలిశారు . ఈ సందర్బంగా విఐటి విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వ అత్యంత ప్రతిష్ట్మాకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గుర్తింపు పొందిందని మరియు విఐటి-ఏపీ విశ్వవిద్యాలయ పురోగతిని ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి మొదటి విడతలో 25 లక్షలు అందించగా రెండవ విడతగా మరో 50 లక్షల రూపాయల విరాళాన్ని అందించినట్లు విఐటి ఫౌండర్ & ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ తెలిపారు.
విఐటి-ఏపీ క్యాంపస్, దేశంలోని ఉత్తమ క్యాంపస్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందుతుందని అన్నారు 2021-’22 విద్యాసంవత్సరం నుంచి నాన్ ఇంజనీరింగ్ కోర్సులలో జివి స్కాలర్‌షిప్ మరియు రాజేశ్వరి మెరిట్ స్కాలర్-షిప్‌ల క్రింద 50% -100% స్కాలర్-షిప్‌లను జిల్లా టాపర్లు మరియు స్టేట్ టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులు అందిస్తున్నామని ప్రకటించారు .
అమరావతిని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసే దిశలో పాలుపంచుకుంటున్న విఐటి-ఏపీ యాజమాన్యాన్ని, అధ్యాపకులను మరియు సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశంసించారు.
వైస్-ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటా రెడ్డి మాట్లాడుతూ, వి.ఐ.టి-ఏపీ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ క్రింద బి. టెక్ లో సిఎస్ఇ, ఇసిఇ, మెకానికల్ , బిబిఎలో డిజిటల్ మార్కెటింగ్, ఫిన్‌టెక్, బిజినెస్ అనలిటిక్స్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ లో ఎంటెక్ సిఎస్ఇ, విఎల్ ఎస్ ఐ, ఎం ఎస్.సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, డేటా సైన్స్, డ్యూయల్ డిగ్రీ విభాగంలో బి.ఏ -ఎం ఏ పబ్లిక్ సర్వీస్, బి.ఎస్.సి -యమ.ఎస్.సి డేటా సైన్స్ మరియు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులలో బిఎ. ఎల్‌ఎల్‌బి, బిబిఎ. ఎల్‌ఎల్‌బి, ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లను ఏడు వేర్వేరు స్కూల్స్ ద్వారా అందిస్తున్నారు . అవి స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (SCOPE), స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (SENSE), స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ (SMEC), స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ (SAS), విఐటి-ఎపి స్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB), విఐటి-ఎపి స్కూల్ ఆఫ్ లా (VSL), విఐటి-ఎపి స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యూమానిటైస్ (VISH ).
విఐటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ మాట్లాడుతూ విఐటి ఏపీ క్యాంపస్‌లో 27 రాష్ట్రాలు 6 దేశాల నుండి 4728 మంది విద్యార్థులు చదువుతున్నారని , అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో 72 స్టూడెంట్ క్లబ్‌లు, అధ్యాయాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడానికి పరిశ్రమ భాగస్వాములతో 14 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని , యుఎస్ఎ, యుకె, ఆస్ట్రేలియా మరియు యూరప్ నుండి 18 భాగస్వామి విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందం కలిగి ఉన్నామని , విదేశాలలో అనేక ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలతో ఈ సంబంధాల ద్వారా, అధ్యాపకుల మార్పిడి కోసం మార్గాలు సులభం అవుతాయని అన్నారు. సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ (SAP) అంతర్జాతీయ బదిలీ కార్యక్రమం (International Transfer Programme) వంటి వాటి ద్వారా 2 సంవత్సరాలు. విఐటి-ఏపీ లో మరియు 2 సంవత్సరాలు విదేశాలలో చదివే వీలు కలుగుతుందని తెలియచేసారు. ప్రాంగణ ఎంపికలలో విఐటి-ఎపి విశ్వవిద్యాలయ విద్యార్థులు మొత్తం 559 ఆఫర్లు, 243 సూపర్ డ్రీం మరియు డ్రీం ఆఫర్లతో సగటున 6.28 లక్షలు వార్షిక వేతనంతో ఉద్యోగాలను సాధించారు .
విఐటి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాథన్, విఐటి-ఏపీ రిజిస్ట్రార్ డాక్టర్ సిఎల్వి శివకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.