ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో హిందూమతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. గోవధచట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మాట్లాడడంపై ఆగ్రహం. గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా.. భారతీయులను కించపరస్తారా అని పరామర్శించారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి లేదా ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. తరచుగా హిందువులను కించపరిచే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలి. దేవాలయాలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలి తెలిపారు. జెరూసలేం, మక్కా వెళ్ళేవారికి నిధులు ఇస్తారా.. తిరుపతి వెళ్ళడానికి – హిందువులకు నిధులు మంజూరు చేయండి అని అన్నారు.
దేశ హితం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారు. వైసీపీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది. వైసీపీ ఏర్పాటు చేసిన కార్పోరేషన్లకు నిధులు, విధులు మంజూరు చేయండి. నాలుగు రోజుల పాటు దేవాలయాలు దర్శించి ఆలయాలు అభివృద్ధికి బీజేపీ బాటలు వేయాలని కోరుతోంది అని అన్నారు.