ఏపీలో రాజకీయం మారుతోందా? మూడో రాజకీయశక్తి వైపు అడుగులు పడుతున్నాయా? టీడీపీ, వైసీపీలకు పోటీగా మరో రాజకీయ ప్రత్యామ్నాయం రాబోతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. గోదావరి తీరం నుంచి కొత్త రాజకీయ పవనాలు వీస్తున్నాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయశక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బీసీ, ఎస్.సి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.…
ఏపీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఇచ్చారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ వర్గాలు సాదర స్వాగతం పలికాయి. కాగా శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎన్వీ రమణకు…
వైసీపీ మళ్ళీ అధికారం లోకి రావడం ఖాయమని.. ఈ విషయాన్ని ఎల్లో మీడియా గుర్తు పెట్టుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల ఫలితాలు మార్చే పరిస్థితి ఉండదని చురకలు అంటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారని… గ్రామాల్లోకి వెళితే కేవలం ఇల్లు కోసం అర్జీలు, లేదా భూ వివాదాలపై మాత్రమే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. జగనన్న శాశ్వత భూ హక్కు,…
విశాఖపట్నంలో ఇవాళ పర్యటించిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏపీ 30ఏళ్ళు వెనక్కుపోయిందని నిప్పులు చెరిగారు. బీహార్ కంటే దారుణమైన పాలన ఏపీలో ఉందని…రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కారణంగానే కేంద్రాన్ని అడగలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో తలా తోక లేని పాలన జరుగుతోందని… వచ్చే 30 నెలల్లో భారతీయ జనతా పార్టీ సమర్ధత ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. హాయగ్రీవ జగదీశ్వరుడు వెనుక తన ప్రమేయం లేదన్నారు ఎంపీ…
ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నోవోటెల్ హోటల్‌లో తన భార్య భారతితో కలిసి జగన్ సీజేఐను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సీజేఐతో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటనకు కడప జిల్లా వెళ్లిన జగన్ ఈరోజు మధ్యాహ్నమే విజయవాడకు చేరుకున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మూతపడిన పరిశ్రమలను తెరవలేని వారు.. స్టీల్ ప్లాంట్ పల్లవి అందుకుంటారా.. డబ్బులు కేంద్రం ఇస్తే.. సోకులు రాష్ట్ర ప్రభుత్వానివా.. పధకాలకు ఇచ్చే డబ్బులు మళ్లించి.. బిల్లులు ఆపుతారా అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు డబ్బులు వేశాం. కానీ మోడీ వేసిన డబ్బులను కూడా జగన్ లాగేసుకున్నారు అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ స్టిక్కర్ బాబులు… వీళ్లతో అభివృద్ధి…
ఈనెల 27న ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లా వెళ్లనున్నారు. ఈ నెల 27న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె రిసెప్షన్ కార్యక్రమం ఎర్రగొండపాలెంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం రాక సందర్భంగా ఎర్రగొండపాలెంలో భద్రతా ఏర్పాట్లను ఈరోజు పోలీసులు పరిశీలించారు. Read Also: మంత్రి అనిల్ కి బండ్ల మార్క్ పంచ్.. ఇందులో భాగంగా హెలీప్యాడ్, వీఐపీ గ్యాలరీలు, వాహనాల పార్కింగ్ ప్రాంతం, రిసెప్షన్…
బీజేపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఉడుత ఊపులకు భయపడేది లేదని, కేంద్రమే రాష్ట్ర పోలీసులకు ఈ మధ్య అనేక అవార్డులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. ఫెడరల్ విధానంలో ఏ హక్కుతో కేంద్రం రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై నిఘా పెడుతుందో సీఎమ్ రమేష్ చెప్పాలి. సీఎం రమేష్ చంద్రబాబు ఏజెంట్ గా మాట్లాడుతున్నాడు.…
కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం నాడు పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో రూ.110 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులను చారిత్రాత్మక ఘటనగా సీఎం జగన్ అభివర్ణించారు. పులివెందులకు మంచి కంపెనీ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల ఉద్యోగాలు లభిస్తాయని…
ఏపీలో ఒక వైపు టికెట్ల రేట్ల పై రచ్చ కొనసాగుతోంది. సినిమా వర్సెస్ రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో అంబికా కృష్ణ కామెంట్స్ చేయడంతో మరోమారు ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగటం లేదన్నారు అంబికా కృష్ణ. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ జరగకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదు. అందుకే ప్రభుత్వం సినీ పరిశ్రమ, ధియేటర్లపై ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. సీ క్లాస్ థియేటర్ల టిక్కెట్ల రేట్లు…