సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేటి నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణా జిల్లాలోని ఎన్వీ రమణ సొంతూరైన పొన్నవరం రానున్నారు. గత రెండుసంవత్సరాల క్రితం జస్టిస్ ఎన్వీ రమన్ తన సొంతూరు వచ్చారు. అయితే తొలిసారి సీజేఐ హోదాలో స్వగ్రామానికి ఎన్వీ రమణ విచ్చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనను పొన్నవరంలో ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్వీ రమణ స్వగ్రామానికి వస్తున్నందున గ్రామస్థుల అభినందన…
ఏపీలో ప్రస్తుతం సినిమా టిక్కెట్ల రేట్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎంతోమంది కార్మికులు ఆధారపడ్డ సినిమా థియేటర్ల కంటే వాటి పక్కన ఉండే కిరాణాషాప్ వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారంటూ హీరో నాని చేసిన కామెంట్లు అధికార పార్టీలో వేడిని పుట్టించాయి. మార్కెట్‌లో ప్రతిదానికి ఎమ్మార్పీ ఉన్నట్లే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అయితే హీరో…
ఏపీ సీఎం జగన్ ఈ రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో రూ. 515 కోట్లతో మొత్తం 8 అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చనిపోయాక కడప జిల్లా జనం నన్ను గుండెల్లో పెట్టుకున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో 30 నెలల్లో ప్రజలకు 320 కోట్లు బదిలీ చేసామని, 22,212 మంది అక్క చెల్లెమ్మలకు…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింది వీడియో లింక్‌లో వీక్షించండి..
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులివ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఒక ఇంటిలోని పోర్షన్ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఫలితంగా మీటర్…
సీఎం జగన్‌పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో జగన్ నియంత పాలన సాగిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర రూ.18 వేలకు అమ్ముతున్నారని, మధ్య, పేద తరగతి కుటుంబాలపై తీవ్ర భారం మోపుతున్నారని ఆయన అన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి పవన్ ప్రస్తావించాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ పథకాన్ని నిలిపివేయాలని,…
ఏపీలో పీఆర్సీపై నెలకొన్న సందిగ్ధత వీడలేదు. అమరావతిలోని సచివాలయంలో ముగిసింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. వచ్చే వారం ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ జరిగే అవకాశం వుంది. ఆ తర్వాతే ఫిట్ మెంట్, ఇతర ఆర్థిక అంశాల పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా వుంటేఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు సమావేశం అనంతరం మాట్లాడారు. మా 71 డిమాండ్ల పై అధికారులు…
సీఎం జగన్ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం కనిపించింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని కుమారుడు వివాహనికి హాజరైన సీఎం జగన్ వారిని ఆశీర్వదించారు. పంచలింగాల మాంటిస్సోరి ఒలింపస్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన వేడుకలో వరుడు శివ నరసింహారెడ్డి, వధువు రూపశ్రీ లను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి జగన్. ప్రోటోకాల్ లిస్ట్ లో కళ్యాణవేదికపై కాటసాని కుటుంబ సభ్యులు, జగన్ కి మాత్రమే పోలీస్ అనుమతి వుంది. సీఎం పర్యటన అంటే భద్రతా ఏర్పాట్లు భారీగా వుంటాయి. అయితే వేదిక…
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25వరకు మూడు రోజుల పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రొద్దుటూరు , పులివెందులలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మొదటి రోజు జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..(23.12.2021)ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు.12.00 –…
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. క్యాంప్ కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. ప్రధానితో వీసీ కార్యక్రమానికి హాజరయ్యారు ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎస్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్‌రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లిఖార్జునరావు…