శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళదామని అనుకుంటున్నారా? అయితే కాసేపు ఆగండి. గతంలోలాగా దర్శనానికి వెళితే ఇబ్బందులు తప్పవంటున్నారు దేవస్థానం అధికారులు. కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా శ్రీశైలంలో ఆన్ లైన్ విధానం పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు చేపట్టారు.
ఈనెల 25 నుంచి ఉచిత దర్శనం , రూ.150, రూ.300 దర్శనం, ఆర్జిత సేవల టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారానే పొందాలని ఈవో లవన్న తెలిపారు. భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ ధ్రువ పత్రం ఆన్ లైన్ లో సమర్పించాల్సి వుంటుందన్నారు. భక్తులు www.srisaila devasthanam.org ద్వారా ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు పొందే అవకాశం వుందన్నారు ఈవో లవన్న. కరోనా కారణంగా గత కొంతకాలంగా భక్తులు దర్శనాలకు రావడం ఇబ్బందిగా వుంది. శ్రీశైలం మల్లిఖార్జునుడిని దర్శించుకోవాలని భావించేవారు ఇక నుంచి ఆన్ లైన్ టికెట్ల విధానం అనుసరించాల్సి వుంటుంది.