తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. జూన్ నెల రాకముందే.. వ్యవసాయ పనులు మొదలు కాకముందే ఖరీఫ్ పంట కి వైఎస్సార్ రైతు భరోసా అందించడం సంతోషంగా వుంది. రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్నాం అన్నారు. మూడేళ్లలో ఎక్కడా కరువు లేదు.. ఒక్కమండలం కూడా కరువు మండలం గా ప్రకటించలేదు.
రైతుల పరామర్శ కి వెళ్తున్న దత్త పుత్రుడు పట్టాదారు పాసు బుక్కు వుండి నష్టపోయిన ఒక్కరినీ చూపించలేకపోయారు. రైతుల విషయంలో గత ప్రభుత్వాలకు ఎంత ప్రేమ వుంది.. వైసీపీ ప్రభుత్వానికి ఎంత ప్రేమ వుందో రైతులు గుర్తించాలి. ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఏడున్నర లక్షలు ఇస్తున్నాం అన్నారు సీఎం జగన్.
కౌలు రైతులకు ఏనాడైనా పెట్టుబడి సహాయం చేశారా?ఇలా రూ.13500 చొప్పున ఇచ్చారా?మనం మేనిఫెస్టోలో చెప్పింది రూ.12500 చొప్పున నాలుగేళ్లపాటు ఇస్తామని చెప్పింది 4 ఏళ్లు అయితే.. 5 ఏళ్లు ఇస్తున్నాం:రూ.13500 చొప్పున 67500 రైతన్నలకు ఇస్తున్నాం:దీన్ని గమనించమని కోరుతున్నాను. వైయస్సార్‌సున్నా వడ్డీ ద్వారా 65 లక్షలమందికిపైగా రైతులకు రూ.1282 కోట్ల రూపాయలు సున్నావడ్డీకింద ఇచ్చాం. ఐదేళ్లలో చంద్రబాబు రూ.782 కోట్లు ఇచ్చారు: తేడా చూడమని చెప్తున్నాను. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతుకు అండగా నిలిచాం అన్నారు జగన్.
రైతులకు మేలు చేయాలంటే రైతుల జీవనవిధానం, సంస్కృతి పై అవగాహన ఉండాలి.. అలాంటి అవగాహన లేని ప్రభుత్వాలను గతం లో చూశాం. రైతులకు ఉచిత కరెంట్ వద్దు, వ్యవసాయం దండగ అంటూ రైతుల పై కాల్పులు జరిపించారు చంద్రబాబు. ప్రశ్నించాల్సిన సమయంలో అది చేయకుండా ఇపుడు దత్త పుత్రుడు ప్రశ్నిస్తా అంటున్నారు.
లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. అర్హత వున్న రైతు నాకు ఓటు వేసినా.. వేయకపోయినా ఫర్వాలేదు. కేంద్రం మద్దతు ధర ప్రకటించిన ఆరుపంటల్ని తక్కువ ధరకు అమ్ముకోకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వమే దగ్గరుండి మంచి ధరకు కొనుగోలు చేశాం. గతంలో ఇలాంటి విధానం వుండేదా అని జగన్ ప్రశ్నించారు. ఆక్వా రైతులకు తోడుగా వుండేందుకు కరెంట్ సబ్సిడీ ఇచ్చాం. మూడేళ్ళలో రూ. 2వేల కోట్లకు పైగా కరెంట్ సబ్సిడీ ఇచ్చాం.
ఆక్వా సాగు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఆక్వా సాగు కోవిడ్ తో నష్టపోయిన రైతుల్ని ఆదుకున్నాం. ఆక్వా కల్చర్ కేవలం పశ్చిమగోదావరి జిల్లా లక్షా 72 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 5 ఎకరాల లోపు వారు 87 శాతం రైతులు సాగుచేస్తున్నారు. ఈ రైతులు సాగుచేసేది 70 వేల 518 ఎకరాలు. కార్పోరేట్ వ్యవసాయం చేస్తున్నవారు 13 శాతం మంది అంటే 5 వేల మంది రైతులు. వారికి కూడా మనం అండగా నిలబడ్డాం. కోవిడ్ తర్వాత చిన్న, సన్నకారు రైతులకు సాయం చేయాలి. కరెంట్ సబ్సిడీ వారికి కొనసాగుతుందన్నారు సీఎం జగన్. ఎన్నికల తర్వాత చేయడం ధర్మం కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడతా. ప్రజలకు మంచి చేయాలి. చంద్రబాబులా మాట్లాడను. 10 ఎకరాల లోపు సబ్సిడీ ఇవ్వాలని అడిగారు. వారికి మాట ఇస్తున్నాను. వారికి కూడా యూనిట్ 1.50 పైసలు సబ్సిడీ ఇస్తాం. ఎన్నికలు వచ్చినా రాకున్నా మాట నిలబెట్టుకున్నాం.