అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అందాల సీమను కలహాల సీమగా మార్చాడని దుయ్యబట్టారు. మళ్లీ ఈ పరిస్థితులు రాకుండా కాపాడుతామని పవన్ తెలిపారు. జగన్.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుపరచలేదని ఆరోపించారు. మళ్లీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి వస్తే నిలదీయండని పేర్కొన్నారు.…
రంజాన్ సందర్భంగా షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు అందిస్తూ వెల్‌కమ్ చెప్పారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి…
చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. సుమారు 2000 కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. గురజాల నియోజకవర్గంలో ఇంటింటికి కులాయి కార్యక్రమం 50 శాతం పూర్తి చేయగలిగాం.. మరొక 50 శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు అని పేర్కొన్నారు. పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, బైపాస్ నిర్మాణాలు చేశాం.. సంక్షేమ కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలు లేరు గళం మాత్రం ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. నేను పెద్ద ముదురు అని చంద్రబాబు అంటున్నారు.. చంద్రబాబు కంటే ప్రజలకు మేలు చేయడంలో.. రైతులకు మేలు చేయడంలో నేను ముదురన్నారు.
మేమంత సిద్ధం సభ జనసముద్రంగా మారిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధం సిద్ధం అంటూ ప్రజల నినాదాలు వైసీసీ జైత్రయాత్రకు శంఖారావంలా వినిపిస్తున్నాయి.. ప్రజలు చేస్తున్న సిద్ధం సిద్ధం అనే నినాదం ప్రతిపక్షాలకు యుద్ధం యుద్ధం అన్నట్లు ఉంది.
చరిత్రలో నిలిచిపోయే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ లు కూడా ప్రజల కోసం పని చేశారు అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరికి మించి, ప్రతి ఇంటికి చేరువైన ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల మనసు గెలిచారు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు.
డోర్ టూ డోర్ వెళ్లడం మా తొలి ప్రణాళిక.. డోర్ టూ డోర్ వెళ్లడం మా తొలి ప్రణాళిక అని, పెద్దగా సభలు పెట్టాలని అనుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. బీజేపీ గెలవాలి.. మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. పోలింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను అభ్యర్ధిగా ఉన్నాను సో అందరిని కో ఆర్డినేట్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్…
ఏపీలో వైసీపీ ఇంజిన్ ఒకటే.. అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఇంజిన్లతో పని లేదు.. ఇంజిన్ కన్నా శరవేగంగా దూసుకుపోగల సత్తా జగనన్నది అని మార్గాని భరత్ అన్నారు.
పెన్షన్లు పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను ఎండలో నిలబెట్టారు.. ఇక, వాలంటీర్ల వ్యవస్థే లేదంట అనే వార్త బయటకు వచ్చింది.. వాలంటీర్ల వ్యవస్ఖను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా..? అని ప్రశ్నించారు.
త్వరలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నాను అని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉంది.. నా భావ జాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయాను అని పేర్కొన్నారు.