కరెంట్ పునరుద్ధరణ.. ఉప్పల్ స్టేడియంలో యధావిధిగా హైదరాబాద్, చెన్నై మ్యాచ్!
ఉప్పల్ స్టేడియంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించని కారణంగా.. విద్యుత్‌శాఖ అధికారులు గురువారం (ఏప్రిల్ 4) స్టేడియంలో కరెంట్ నిలిపివేశారు. కరెంట్ నిలిపివేయడంతో ఒక్కసారిగా స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. జనరేటర్ల సహాయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో అసలు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు చెలరేగాయి.
ఏనుగు కోసం సర్చ్ ఆపరేషన్.. డ్రోన్ కెమెరాలతో కదలికలపై ఆరా
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజుల నుంచి ఏనుగు భీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందగా.. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగు కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న రాత్రి కొండపల్లి రోడ్డు పై గజరాజు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. మొన్న మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా నుంచి ప్రాణహిత నది దాటిన ఏనుగు తెలంగాణ లొకి వచ్చింది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరిని రెండు వేర్వేరు చోట్ల తొక్కి చంపింది. దీంతో అధికారులు ఏనుగుకోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నాలుగేళ్లుగా మంద నుంచి తప్పి ఒంటరిగా సంచరిస్తున్నట్లు గుర్తించారు. కొంత కాలంగా ఒడిశా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో తిరిగిందని, తొలి సారిగా తెలంగాణ లోకి ప్రవేశించి మనషులపై దాడి చేస్తుందని అధికారులు గుర్తించారు. పంట పొలాలు, నీళ్ళు ఉన్న కాల్వల పరిసరాల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు.
మహిళ కడుపులోని 10 కిలోల కణితిని తొలగించిన ఎమ్మెల్యే డాక్టర్..!
కొందరి శరీరంలో అనుకోకుండా అనవసరమైన భాగాలు వృది చెందడం మనం చూస్తూనే ఉంటాము. ఇలా వచ్చిన వాటితో అనవసరంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా గమనించే ఉంటాం. అయితే వాటిని సర్జరీ చేయించుకొని తీసేసిన తర్వాతనే వారు పూర్తి ఆరోగ్యంగా మారుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు గత సంవత్సర కాలం నుండి కడుపు నొప్పితో బాగా బాధపడుతోంది. ఇకపోతే ఈ విషయాన్ని కాస్త.. ఆమె అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దృష్టికి వెళ్లగా, సదరు మహిళకు టెస్ట్ లు చేయించిన తర్వాత కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు మరో ముగ్గురు వైద్యుల బృందం కలిసి ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించారు.
నేడు కేసీఆర్ రెండు జిల్లాల పర్యటన.. ఎండిన పంటల పరిశీలన..
పొలంబాటలో భాగంగా నేడు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తు ముందుకు సాగుతున్నాను. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఎండిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈమేరకు రెండు జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఎర్రవెల్లి ఫారం నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ ఎండిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు.
సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విరామం
ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డి పాలెం దగ్గర క్యాంప్ లో జగన్ బస చేయనున్నారు. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లాలో నేతలతో ఆయన ప్రత్యేకించి మాట్లాడతారు. వారికి రానున్న ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో గెలుపు సాధించే దిశగా చేయాల్సిన ప్రయత్నాలపై దిశానిర్దేశం చేయనున్నారు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలకు క్యాంప్ సైట్ వద్దకు రావాలని పిలుపు వెళ్లింది. జగన్ మేమంతా బస్సు యాత్ర గత నెల 27వ తేదీన ఇడుపుపల పాయ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆయన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పర్యటించి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. ప్రతి రోజు వివిధ వర్గాల వారితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సాయంత్రం బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది
కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఒక్క పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థాన్నాల్లో సీపీఐని బలపర్చటానికి కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందని, ఇటీవల హైదరాబాద్ నందు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా నివాసంలో ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నుంచి షర్మిలా, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర పార్టీ ప్రతినిధి కె.రాజు, సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు పాల్గొన్నారు. ఈ చర్చల్లో ఏ ఏ స్థానాల్లో సీపీఐని కాంగ్రెస్ బలపరుస్తుందనే అంశాన్ని ప్రకటించారు. గుంటూరు పార్లమెంటు స్ధానంతో పాటు.. విశాఖపట్నం పశ్చిమ, ఏలూరు, విజయవాడ పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయనుంది.