Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ ఏడాది తొలి 7 నెలల్లో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రకటించింది. తొలి ఏడు నెలల్లో రూ.40,361 కోట్ల పెట్టుబడులను ఏపీ రాబట్టినట్లు డీపీఐఐటీ తన నివేదికలో వెల్లడించింది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ, ఒడిశా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాలు…
అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం తన కసరత్తు ప్రారంభించింది. పూలింగ్ గ్రామాలతో పాటు మూడు నాన్ పూలింగ్ గ్రామాలను కూడా కొత్తగా ఏర్పాటు చేసే అమరావతి మున్సిపాల్టీలో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా గ్రామ సభలు నిర్వహించి.. ప్రజాభిప్రాయాన్ని స్వీకరించే ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అయితే తొలి రోజు జరిగిన మూడు గ్రామసభల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకతే ఎదురైంది. అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అమరావతి క్యాపిటల్…
Andhra Pradesh: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకానికి జగన్ ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు విభిన్న ప్రతిభావంతుల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో పెళ్లి కానుక ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద ఎస్సీలకు రూ.లక్ష మేర పెళ్లి కానుక, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ. 1.20 లక్షలు, ఎస్టీలకు…
CM Jagan Review Meeting: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈఏపీ (ఎక్స్‌టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూడెవలప్‌మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణ సహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పనుల్లో…
CM Jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలను సీఎం జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన పలువురు మంత్రుల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నా.. మంత్రులు స్పందించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. మంత్రులు తీరు మార్చుకోకపోతే కేబినెట్‌లో మార్పులు తప్పవని జగన్ హెచ్చరించారు. తేడా వస్తే ఇద్దరు, ముగ్గురిని తప్పించడానికి వెనకాడనని…
Vijayawada: ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. ఈ మేరకు విజయవాడలో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వారంలో న్యాయం చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు స్పందించడంలేదంటూ అగ్రిగోల్డ్ బాధితులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్…
Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర…
CM Jagan: ఈనెల 6న మంగళవారం నాడు ఏపీ సీఎం జగన్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ మేరకు సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు…
CM Jagan: సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరనున్నారు. మధ్యాహ్నం 3:50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల…