ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో.. విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్ట్) నుంచి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అతడు అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తించారు.. లోకేష్ కి అమెరికన్ సిటీజన్ షిప్ ఉన్నట్టు కూడా నిర్ధారణకు వచ్చారు పోలీసులు.