రాబోయే 2023 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా శనివారం ప్రకటించారు.
తెలంగాణ పర్యటనకు వచ్చిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా.. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.. ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చిన సంగ్మా దంపతులను.. మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.. ఇక, వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా మధ్య చర్చలు జరిగాయి.. మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఐటీ మంత్రి చర్చించినట్లు సమాచారం. ఇక, ఈ సమావేశం విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్…