ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అంటె సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు… ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్నారు. ఆల్కాహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చు..
Also Read:Hyderabad Rains : ఇది మన అమీర్‌పేటే..!
మద్యం కారణంగా పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాలన్నారు. బార్లలో కూడా కల్లు గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటికే మద్యం షాపుల్లో పది శాతం షాపులు.. కల్లు గీత కార్మికులకు కేటాయించింది ప్రభుత్వం. ఇప్పుడు బార్ లైసెన్స్ లో కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది. 840 బార్లలో.. 84 బార్లు కల్లు గీత కార్మికులకు వచ్చే అవకాశం ఉంది.