అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభంకానుండగా.. రేపు వివిధ జిల్లాల్లో మిగత 99 క్యాంటీన్లను.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.
కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉన్నాయి.. ప్రజల ఆశలను నెరవేరుస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. భారత స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జెండా ఎగురవేసి శుభాకంక్షలు తెలిపిన ఆయన.. ఆ తర్వాత మాట్లాడుతూ.. రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించాం. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నాం. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందాం. 2014-19 మధ్య కాలంలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచాం అన్నారు..
ఇసుక సరఫరా, నూతన ఉచిత ఇసుక విధానంపై అధికారులతో బుధవారం రోజు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక బుకింగ్ విధానం, రవాణా, సులభమైన లావాదేవీలు, విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష చేసిన సీఎం.. వెబ్ సైట్, యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని ఆదేశించారు.
“నిందితులను రక్షించే ప్రయత్నం”.. కోల్‌కతా డాక్టర్ ఘటనలో మిత్రపక్షంపై విమర్శలు.. కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ నేతలు మెల్లిగా స్పందిస్తున్నారు. ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాత ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బాధితురాలికి న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే…
Minister Narayana: రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతులతో అన్న క్యాంటిన్ లను ప్రారంభిస్తారు అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గతంలో 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్లు నిర్వహించాం.
Nallari Kiran Kumar Reddy: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లు సీఎం చంద్రబాబుకు పెను సవాల్ అన్నారు.
AP Govt: ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై ఒప్పందం చేసుకుంది.
AP Super Speciality Hospitals: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసులు ఇచ్చాయి. మా బకాయిలు మాకు ఇచ్చే వరకు ఇక ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం అని వెల్లడించాయి.
Anna Canteens: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపడం కోసం కూటమి సర్కార్ మళ్ళీ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి.
Vijayawada Traffic: రేపు ఉదయం 9 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం విజయవాడలో జరిగే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఇతర ముఖ్య అతిధులు హాజరుకానున్నారు.