నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీ. రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం. నిర్మాణాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఐఐటీ నిపుణులు. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావారణ శాఖ. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు…
పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖ రివ్యూలో అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు. వివిధ రకాల కార్పొరేషన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల వివరాలను సీఎం చంద్రబాబు అడిగితే అవి లేవని అధికారులు చెప్పడంతో.. కనెక్షన్ల సొమ్ములను కూడా దోచుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం.. ఫైల్స్ దగ్ధం కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. రెండు రోజుల్లో కేసు ఫైల్‌ను సీఐడీకి అప్పగించనున్నారు పోలీసులు.
ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు మాజీ సీఎం వైఎస్ జగన్.. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వారు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. దాడులు చేసి ఏమి సాధిస్తున్నారో తెలియడం లేదన్న ఆయన.. ఇలాంటి కిరాతకాలు దారుణాలతో ప్రజలను ఎవరూ భయపడరు.. ఇదంతా ప్రజల్లో కోపంగా మారి టీడీపీని బంగాళాఖాతంలో కలిపేలా చేస్తుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు.. ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై హాట్ కామెంట్లు చేశారు.. చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాదర్భార్లు నిర్వహించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రజలకు మంచి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ఇక, గత ప్రభుత్వం అసలు ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదని విమర్శించారు..
యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపిన విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆన్ లైన్లో యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపినట్లుగా ట్వీట్ చేశారు.. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో సమావేశమయ్యాను. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆహ్వానించామని పేర్కొన్నారు
ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. అధికారులతో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశం అయ్యారు.. విజన్ డాక్యుమెంటులో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు..
బంగ్లాదేశ్‌లో దేవాలయాలను రక్షించడానికి రాత్రంతా నిలబడిన విద్యార్థులు బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత హిందూ వ్యతిరేక హింస కొనసాగుతోంది. ఢాకాలోని ఖిల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరిగాయి. ఛాందసవాదులు ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారు. ఇంతలో విషయం తీవ్రం కావడంతో ఎవరూ హాని చేయవద్దని మసీదుల నుండి ప్రజలు ప్రకటించారు. కొన్ని చోట్ల, దేవాలయాల భద్రత కోసం విద్యార్థులను మోహరించారు. వారు రాత్రంతా ఆలయాలను కాపలాగా ఉంచారు. బంగ్లాదేశ్‌లోని మసీదు లోపల నుంచి…
బంగ్లాదేశ్‌లో ప్రతి ఏడాది దేశం విడిచి వెళ్తున్న 2.3 లక్షల మంది హిందువులు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అతి పెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. తిరుగుబాటు తర్వాత ఛాందసవాదుల ఆధిపత్యం కారణంగా అస్థిరమైన అరాచక వాతావరణం అక్కడి హిందూ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది. వివక్ష, అణచివేతకు గురవుతున్న హిందూ జనాభా నిరంతరం తగ్గిపోతుంది. నేడు బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో హిందువుల వాటా 1951తో పోలిస్తే 14 శాతం మేర…
సచివాలయంలో సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసేందుకు దోహదపడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని టీడీసీ ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు. 2014-19లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయగా, దురదృష్టవశాత్తు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా మార్చేసింది. ప్రస్తుత డిస్పెన్సేషన్లో ఆ పరికరాలు ఏ మేరకు పనిచేస్తాయో పరిశీలిస్తుంది మరియు అవసరమైతే కొత్త వాటిని కొనుగోలు చేస్తుంది మరియు వాటిని వ్యూహాత్మక…