విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో గండి బాజ్జీ.. పీలా గోవింద్, బైరా దిలీప్ ముందు వరుసలో ఉన్నారు.. అయితే, ఈ రోజు సాయంత్రం లోగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి అభ్యర్థిని ప్రకటించనున్నారని తెలుస్తోంది..
ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వృథాగా పోతున్న వరద నీరు.. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వరద నీరు వృథాగా సముద్రంలో కలిసి పోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు వృథాగా పోయిన 2000 టీఎంసీల వరద నీరుని అధికారులు సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి నాలుగు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గత నెల 26వ తారీఖున 13 లక్షల క్యూసెక్కుల వరద…
Vizag MLC Election: విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై కూటమి నేతల కీలక సమావేశం అయింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్న అధిష్ఠానం నియమించిన కమిటీ.. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన నివేదిక ఆధారంగా పోటీపై ఎన్డీయే కూటమి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
CM Chandrababu: తుంగభద్ర డ్యాం కొట్టుకుపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కర్ణాటక ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేలుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో విత్తన కొరత లేదు.. వైసీపీ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోకండి అంటూ వైఎస్ షర్మిలకు సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు.. గత ఐదేళ్ల అన్న పాలనలో రైతుల బాధలు కనపడకపోవడం బాధాకరమన్న ఆయన.. రాజకీయాల కోసం అటు అన్న, ఇటు చెల్లెలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఈ రోజు విశాఖ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. అయితే, ఆ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. కానీ, టీడీపీలో ఇంకా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీ తేలనట్టుగా తెలుస్తోంది.
Adivasi Divas: ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిపేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు.. విజయవాడలో జరిగే ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు.. జులై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్ పుట్ సబ్సీడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని ఆదేశించిన సీఎం. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని క్లారిటీ ఇచ్చారు.
టీడీపీ పొలిట్బ్యూరో సమవేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు.. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్బ్యూరో నిర్ణయించిందన్నారు.. పార్టీ కోసం పని చేసిన నేతలు.. కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచించారు.