అనధికారిక లేఅవుట్లపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అనధికారిక లేఅవుట్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలోని మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లేఅవుట్ల వివరాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
అచ్యుతాపురం ఘటన బాధాకరం అన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. కానీ, ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా నెపం మాపై నెట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరం అన్నారు.
అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశాం.. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు.. బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి.. అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
Chandrababu: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో గల ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు విశాఖ పట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతాపురం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
Police Case: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలోని ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాదంపై రాంబిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎసైన్షియా ఫార్మా ప్రమాదంపై.. ఇప్పటికే అధికారులు విచారణ చేశారు.
CM Chandrababu: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 17 చేరింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. ఇక, గాయపడిన వారిని అనకాపల్లి, విశాఖపట్నంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు.
Atchutapuram Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలోని అచ్యుతాపురంలో గల ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర సర్కార్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం శాంతి భద్రతలను నిర్వీర్యం చేసిందని, నేరాలు పెరిగిపోయయని ఆమె పేర్కొన్నారు. కొన్ని కేసులను రీ-ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలిపారు. ప్రతి కేసునూ రీ-ఇన్వెస్టిగేషన్ చేయలేం కానీ.. సంచలనం రీ-ఇన్వెస్టిగేషన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆలోచన చేస్తామన్నారు. మహిళా భద్రత సహా, వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేశారని హోం మంత్రి తెలిపారు.
ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు.