ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 5 బిలియన్ల యూఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ ఎవ్రెన్ ముందుకొచ్చింది. బ్రూక్‌ఫీల్డ్ , యాక్సిస్ యాజమాన్య బృందం.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దశలవారీగా 3500 మెగావాట్ల సోలార్ , 5500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవ్రెన్…
త్వరలోనే ఏపీలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే, దీనిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఈ రోజు రవాణాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదనంగా 2 వేల బస్సులు.. 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్నారు.. అదే విధంగా రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణ శాఖ చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలా..? వద్దా..? అనే అంశంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్…
భూవివాదాలను త్వరగా పరిష్కరించండి.. మంత్రి లోకేష్ ఆదేశాలు ప్రజా సమస్యల పరిష్కారం ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, 28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు క్యూ కట్టారు ప్రజలు.. అయితే, భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని…
రాష్ట్రంలో వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు, రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యమని ఏపీ గృహనిర్మాణి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టామని, మైలవరంలో ఇళ్ల స్థలాల అంశంలో ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయన్నారు.
ఈ రోజు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యారణం శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. రాష్ట్రంలో చేపట్టబోతున్న నరేగా పనులు, ఈ నెల 23వ తేదీన గ్రామసభల నిర్వహణపై ముఖ్యంగా సమీక్షించను్నారు..
అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలు జారీ చేశారు.. హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా? లేదో? చూడాలని కలెక్టర్లకు సూచించారు సీఎం.. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు సురక్షితమా కాదా అన్న కోణంలోనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.
సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు. కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి అధికారులకు వివరించారు. అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ సౌండ్ లేకపోవడంతో…
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు.