CM Chandrababu: నేడు విజయవాడలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST) ఆధ్వర్యంలో జరుగుతున్న టూరిజం కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో అనారోగ్య సమస్యలకు యోగా పరిష్కారమని, యోగా నిత్య జీవితంలో భాగం కావాలన్నారు. ప్రధాని మోడీ యోగాను దేశంలో ప్రమోట్ చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా డే ఇంత గ్రాండ్ గా జరుగుతుందని ఎవరూ ఊహించలేదని.. కానీ 3 లక్షలకు పైగా విశాఖపట్నం లో పాల్గొని గిన్నిస్ రికార్డ్ సృష్టించారన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ లో వెల్నెస్ కి చిరునామా అవుతుంది. అందరికి యోగ అందించాలనే లక్ష్యంగా పని చేస్తున్నాం. రామ్ దేవ్ బాబాను ఏపీకి టూరిజం సలహాదారుగా ఉండాలని కోరుతున్నానని అన్నారు.
Read Also: Sunnam Cheruvu : సున్నం చెరువు నీరు.. విద్యార్థుల జీవితాల్లో విషం.!
కమ్యూనిజం.. సోషలిజం.. క్యాప్టిలిజం.. అన్ని ఇజాలు పోయాయని.. టూరిజం ఒక్కటే మిగిలిందని నేను ఎప్పుడో చెప్పాను. నేను గతంలో టెక్నలాజిని ప్రమోట్ చేశాను. గతంలో బిల్ గేట్స్ తో సమావేశం తర్వాత హైదరాబాద్ లో సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాట్సాప్ లో 700 కు పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. టూరిజం ఒక్కటే ఉద్యోగాలు ఇవ్వగలదు. ప్రకృతి ఆహారం, యోగతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, శ్రీశైలం తో పాటు అనేక పుణ్య క్షేత్రాలు ఉన్నాయన్నారు. అలాగే కొనసీమ, రాజమండ్రి గోదావరి, మదనపల్లి హార్స్ లీ హిల్స్ వంటి ప్రదేశాలు ఉన్నాయన్నారు.
Read Also:Baba Ramdev: సీఎం చంద్రబాబు కేవలం రాజకీయ నేత కాదు.. ఒక విజనరీ
అలాగే సీఎం మాట్లాడుతూ.. టూరిజం భవిష్యత్ లో గేమ్ చేంజర్ అన్నారు. టూరిజంలో పెట్టుబడులు జిఎస్టీ మినహాయింపు ఉంటుందన్నారు. మోడల్ టూరిజానికి ఏపీ చిరునామాగా ఉంటుందని, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కేవలం 20 వేల హోటల్ రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. భవిష్యత్ లో హోటల్ రూమ్స్ 50 వేలకు పెరగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజంలో ప్రపంచం లోనే నెంబర్ 1 అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఏపీలో నదులు వాటర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధికి ఎంతో ఉపయోగంగా ఉంటాయని అన్నారు.