నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ దావోస్ వేదికగా మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఉన్న వేదికపై వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఎలాంటి వేదికలపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నావని టీజీ భరత్ పై మండిపడ్డారట.. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీజీ భరత్ కు సూచించారు సీఎం చంద్రబాబు..
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. వారి ఆధ్వర్యంలో అభివృద్ధికి అవకాశం ఉందన్నారు టీజీ వెంకటేష్..
సాయంత్రం టీడీపీ మంత్రులతో ప్రత్యేకంగా భేటీకానున్నారు.. నామినేటెడ్ పదవులు.. టీడీపీ సభ్యత్వానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.. ఇక, ఎంపీలు, జోనల్ ఇంఛార్జీలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు..
ఎల్లుండి గుంటూరుతో పాటు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.. శనివారం గుంటూరు, కడప జిల్లాల్లో సీఎం పర్యటన ఖరారు అయ్యింది.. ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు.. ఆ తర్వాత కడప జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది... ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది..
ఇవాళ నారావారిపల్లెలో బిజీబిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉదయం కులదైవం నాగాలమ్మను ముఖ్యమంత్రి కుటుంబం దర్శించుకోనుంది. ఆ తర్వాత సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం.. బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహావిష్కరించనున్నారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు.. ''రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. ముందుగానే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మీడియాతో చిట్ చాట్లో ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాక్షించారు.. ఇక, పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలి అని సూచించారు.. నేను అందుకే మా ఊరికి ప్రతీ సంక్రాంతికి వెళ్తున్నాను అన్నారు.. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన…
టీటీడీ ఉన్నాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్త వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సమీక్షలో టీటీడీ ఈవోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ప్రక్షాళన చేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు..