CM Chandrababu: విశాఖకు గూగుల్‌ను తీసుకొస్తున్నామన సీఎం చంద్రబాబు వెల్లడించారు. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు రానున్నాయి.. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్‌టైమ్ డేటా కలెక్షన్లు కీలకమైనవి.. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంటుంది.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా CRDA నూతన భవనం ప్రారంభం కానుంది. ఉదయం 9.54 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఢీల్లీకి వెళ్లనున్నారు.
CM Chandrababu: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సీఎస్, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు…
Jubilee Hills By poll: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోతున్నాయి.. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటించనున్నారు.. అయితే, ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు…
CM Chandrababu: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేతలకు దిశా నిర్దేశం చేశారు.. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు.. ప్రభుత్వం చేసే సంక్షేమం – అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.. చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటి పెరుగుతుంది.. ప్రజలతో మమేకం కావడమే కాదు… ప్రజల్లో…
CM Chandrababu Serious: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేనే లేదు.. మొత్తం అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులే ఉన్నారు. అయినా, అసెంబ్లీ హాట్ టాపిక్‌గా సాగుతోంది.. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం సభలో లేకపోయినా.. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల తీరే.. ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతోంది.. మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యవహారం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ వర్సెస్ బోండా ఉమగా మారిపోయింది.. తాజాగా, కామినేని శ్రీనివాస్…
రేపు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. 10:40కి మాచర్ల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. యాదవుల బజారులో స్వఛ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. పారిశుధ్య కార్మికులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మొక్కలు నాటనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం ఎస్.కె.బి.ఆర్. కాలేజీ గ్రౌండ్ లో ప్రజావేదికలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి హెలికాప్టర్ లో ఉండవల్లికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.