Steel Plant: కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా కడప స్టీల్‌ప్లాంట్ కోసం రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ మేరకు కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ అమోదముద్ర వేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న…
Andhra Pradesh: అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయం ముందు రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెన్నుకు సంబంధించిన సమస్యతో అనారోగ్యానికి గురైన తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ ఆమె సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను గురువారం నాడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, విజయవాడ…
Andhra Pradesh: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో…
అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను 1998 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా తమ పాతికేళ్ల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి జగన్ వద్ద…
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎస్ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో ఆపరేటివ్…
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 నుంచి భువనేశ్వర్‌లో నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈనెల 26న భువనేశ్వర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం. రిపబ్లిక్ డేకి ఎంతో సమయం లేకపోవడంతో అధికారులు భారీ ఏర్పాట్లుచేశారు.